మందుబాబును రెచ్చగొట్టిన పోలీసులు… రోడ్డుపై బట్టలిప్పేశాడు..

హైదరాబాద్: నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ మద్యం ప్రియుడు పోలీసులకు షాక్ ఇచ్చాడు. రాజీవ్ చౌక్ వద్ద మలక్‌పేట్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భాగంగా ఓ ద్విచక్ర వాహనదారుడిని పోలీసులు ఆపారు. మద్యం మత్తులో ఉన్న వాహనదారుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. పోలీసులతో పొట్లాడుతున్న సమయంలోనే తన వంటిపై ఉన్న బట్టలు విప్పేశాడు. అంతిటితో ఆగకుండా పోలీసులపై బూతు పురాణం అందుకున్నాడు. సదరు వాహనదారుడి చేష్టలకు ట్రాఫిక్ పోలీసులు కంగుతిన్నారు. పూటుగా మద్యం తాగిన అతనికి పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా అతను వినకపోవడంతో వెంటనే లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాహనాన్ని సీజ్ చేసి అతనిని వదిలేశారని చెబుతున్నారు. ఆ వెంటనే మందుబాబు కుటుంబసభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే ట్రాఫిక్ పోలీసులు మందుబాబును రెచ్చగొట్టడంతో ఇలా వ్యవహరించారని స్థానికులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.