రాయచోటి నియోజకవర్గంలో36 ట్రాక్టర్ల మంజూరు….

రాయచోటి నియోజకవర్గంలో36 ట్రాక్టర్ల మంజూరు….

ఆర్.బి.ఎం: రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుచున్న జగన్ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా సాగుకు కావాల్సిన ఎరువులు,విత్తనాలు, పురుగుల మందులు అందచేస్తోంది. తాజాగా మరో అడుగు ముందుకేసింది.సాగులో రైతన్నకు సాయంగా నిలిచేందుకు వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం తీసుకొచ్చింది.అతి తక్కువ అద్దెతోఆధునిక యంత్రాలను, పరికరాలును అందుబాటులోకి తెచ్చింది.
సీజన్ ప్రారంభంలో అందరూ ఒకేసారి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు.ఈ క్రమంలో కూలీల కొరత ఉంటుంది.అందువల్ల పెద్దపెద్ద రైతులు యంత్రాలను ఉపయోగిస్తుంటారు.కానీ చిన్న,సన్న కారు రైతులు యంత్ర ఖర్చులు భరించలేరు.ఫలితంగా పనులు ఆలశ్యం అయ్యేవి.ఒక్కోసారి అదును దాటిన తరువాత విత్తనం వేసుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి కష్టాలు రైతులు పడకూడదని జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ యంత్ర సేవ పథకాన్ని తీసుకొచ్చించి.

Leave a Reply

Your email address will not be published.