ప్రపంచ కార్మిక దినోత్సవం..పీడిత జాతికి మహోత్సవం…

ప్రపంచ కార్మిక దినోత్సవం..పీడిత జాతికి మహోత్సవం…

ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవమని అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ సిపిఅధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శ్రామికులు, కార్మికుల్లో మేడే కొత్త స్ఫూర్తిని రగిలించాలని ఆకాంక్షించారు. కార్మికుల్లో చైతన్యం వెల్లివిరియాలన్నారు. శ్రమ దోపిడీని అరికట్టేందుకు ఉద్యమ స్పూర్తితో పోరాడాలన్నారు. జగన్ ప్రభుత్వం అసంఘటిత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు.ఉత్పత్తి ,సేవా రంగాలను బలోపేతం చేసే దిశగా అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం అందరి మన్ననలను పొందుతోందన్నారు. ఆటో కార్మికులు, టైలర్లు, నాయీ బ్రాహ్మణులు, చేనేతలు, రజకులు తదితర దినసరి శ్రామికులకు ఏటా ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తోందన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి చర్యలు చేపట్టిందన్నారు. వైఎస్ఆర్ బీమా అమలు చేస్తోందన్నారు.జగనన్న తోడు క్రింద చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు అందించి వారి జీవితాలలో వెలుగులు నింపుతోందన్నారు. కార్మికులు, నిరుద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు.ఈ సందర్భంగా కార్మిక, కర్షక, శ్రమజీవుల లోకానికి శ్రీకాంత్ రెడ్డి మేడే శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.