మద్యం అమ్మకాల జోరు..

హైదరాబాద్: తెలంగాణలో దసరా సంబరాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో అతిపెద్ద పండుగ అంటే బతుకమ్మ, దసరా, అని చెప్పాలి. కుటుంబ సభ్యులతో కలిసి అందరూ సంతోషంగా గడుపుతారు. అయితే..ఇప్పటికే సంబరాలు పల్లెల్లో మొదలయ్యాయి. ఇక..మద్యం ప్రియులు జోరుగా విక్రయిస్తున్నారు. సాధారణమైన రోజుల్లో మద్యం నిత్యం రూ.60-90 కోట్ల విలువైన విక్రయాలు జరిగితే..గత మూడు రోజులుగా విక్రయాలు భారీగా పెరిగాయి. పండుగ రోజులు దగ్గర పడుతుండటంతో జనాలు ముందస్తుగానే ప్లాన్ చేసుకుని మద్యాన్ని స్టోరేజ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం డిపోల నుంచి దుకాణాలకు రోజుకు రూ.100 కోట్లకుపైగా మద్యం తరలుతోంది. ఈ నెల 26న రూ.174.55 కోట్లు, 27న రూ.123.93 కోట్లు, 28న రూ.117.02 కోట్ల విలువైన విక్రయాలు జరిగినట్లు లెక్కలు చెపుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published.