1600 మంది టీచర్లను బలి తీసుకున్న మహామ్మారి..!

1600 మంది టీచర్లను బలి తీసుకున్న మహామ్మారి..!

ఆర్.బి.ఎం డెస్క్: కరోనా మహామ్మారి ఉగ్రరూపం దాలుస్తు ఎంతో మందిని అన్యాయంగా బలి తీసుకుంటుంది. కాగా ఇటీవల లక్నోలో జరిగిన పంచాయతీ ఎన్నికల విధులోఉన్న 1600 మంది టీచర్లు కరోనా మహామ్మారి దాటికి బలయ్యారని ఉత్తరప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాలు వెల్లడించాయి. ఎన్నికల విధుల్లో పాల్గొని కరోనా సోకడంతో మృత్యువాత పడ్డ టీచర్ల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఒక కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని అదే విధంగా బాధిత కుటుంబ సభ్యులలో ఒక్కరికి ఉద్యోగం కల్పించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఉపాధ్యాయ సంఘాలు లేఖ రాశారు. బాధిత టీచర్ల కుటుంబంలోని అర్హులైనవారికి బీఈడీ టెట్ పరీక్షలు నిర్వహించకుండా వారిని టీచర్లుగా విధుల్లోకి తీసుకోవాలని వారు సూచించారు. కరోనా తో మృతి చెందిన టీచర్లను కరోనా యోధులుగా ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘము ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published.