తీన్మార్ మల్లన్నను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

tennmarmallanna

తీన్మార్ మల్లన్నను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

ఆర్.బి.ఎం హైదరాబాద్: ప్రముఖ జర్నలిస్ట్, క్యూ టీవీ నిర్వాహకుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను సైబర్ క్రైమ్ పోలీసులు నేడు కస్టడీకి తీసుకున్నారు. ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేశారు. అయితే విచారణలో భాగంగా పోలీసులు మల్లన్నను విచారించేందుకు పోలీసు కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. కోర్టు ఒక్కరోజు అనుమతిచ్చింది. దీంతో పోలీసులు మల్లన్నను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం మల్లన్నను చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలిస్తారు.

లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడి ఫిర్యాదు మేరకు మల్లన్నపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మల్లన్న తన నుంచి రూ.30లక్షలు డిమాండ్ చేశారని లక్ష్మీకాంత శర్మ పోలీసులకు ఫిర్యాదు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోవడంతో తన యూట్యూబ్ ఛానెల్‌లో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాడని ఆరోపించారు. లక్ష్మీకాంత శర్మ నుంచి లిఖితపూర్వక ఫిర్యాదు అందడంతో మల్లన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published.