బాణసంచా కాల్చం.. మోజార్టీ అభిప్రాయం ఇదే!
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: దీపావళి ఈ పండగ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఒకప్పుడూ అందరు ఎదురు చూసేవారు. ఇక పండుగ రోజును ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా పటాకులు కాల్చేవారు. ఇరుగు పొరుగింటి వారితో పోటీలు పడి మరీ హడావుడి చేస్తుండేవారు.
కానీ..ఇదంతా గతం.. కానీ కాలం మారిపోయింది. దానితో పాటూ ప్రజల అభిరుచుల్లోనే ఎవరూ ఊహించలేని మార్పులు వచ్చాయి. పటాకులు కాల్చాలనే ధ్యాస ప్రజల్లో క్రమంగా కనమరుగువుతోంది. పర్యారవరణ పరిరక్షణ, ఆరోగ్యం పట్ల పెరిగిన శ్రద్ధ, కాలుష్యం వల్ల కలిగే అనర్థాలపై అవగాహనకు తోడు.. ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంమంతా అరచేతిలోనే కనిపిస్తుండటంతో ఒకప్పటి సరదాల పట్ల ప్రజల్లో ఆసక్తి మెల్లమెల్లగా తగ్గిపోతోంది.
ఈ క్రమంలోనే పెరుగుతున్న కాలుష్యంపై ప్రజలు అవగాహన పెంచుకుంటున్నారు. అందులో భాగంగా దీపావళి పండుగకు బాణసంచా కాల్చడాన్ని తగ్గిస్తూ వస్తున్నారు. పెరుగుతున్న కాలుష్యం వల్ల అప్రమత్తమవుతున్నారు.
దీపావళి వేడుకలు, బాణసంచా వినియోగంపై లోకల్ సర్కిల్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 371 జిల్లాల్లో 28,000 మందిని సంస్థ సర్వే చేసింది. ఈ సర్వేలో 42 శాతం కుటుంబాలు బాణసంచాను నిషేదాన్ని సమర్ధించాయి. 53 శాతం కుటుంబాలు వ్యతిరేకించాయి.
వీరిలో కొందరు కరోనా కొవిడ్ కారణంగా అయినవారిని కోల్పోవడంతో పాటు ఇతర కారణాల వల్ల దీపావళి చేసుకోవడం లేదని చెప్పారు. అంతేకాకుండా కరోనా వల్ల ఉపాధి కోల్పోయామని తెలిపారు. ఆర్థిక పరిస్ధితి కారణంగా బాణసంచా కాల్చడం లేదని తెలిపారు. 15 శాతం మంది మాత్రం పర్యవరణానికి హాని చేయని టపాసులు కాల్చుతామని చెప్పారు. 11 శాతం మంది కేవలం క్రాకర్స్ మాత్రమే కాల్చుతామని పేర్కొన్నారు. 6 శాతం మాత్రం అన్ని రకాల టపాసులతో పండుగ చేసుకుంటామని తెలిపారు. 28 శాతం మంది బాణసంచాపై దేశవ్యాప్తంగా నిషేదం విధించాలని కోరారు.
అధిక ధరలు, కోర్టుల ఆంక్షల కారణంగా మరికొందరు దీపావళి వేడుకలకు దూరంగా ఉంటున్నారు. ఈ ఏడాది దీపావళికి ముందే పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరిమితులు విధించారు. అల్యూమినియం, పొటాసియం నైట్రేట్, బేరియం లవణాలు తదితర హానికర రసాయనాలు లేకుండా తయారు చేసిన బాణసంచా వినియోగం వల్ల 30 శాతం కాలుష్యం తగ్గుతుందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.