బీజేపీ గూటికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..?

బీజేపీ గూటికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..?

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: టీపీసీసీ పదవి కోసం చివరి వరకు ప్రయత్నించిన తనకు కాకుండా రేవంత్ రెడ్డికి ఆ పదవి కట్టబెట్టడంతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధిష్టానం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా పని చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఉద్యమం సమయంలో తన మంత్రి పదవికి సైతం రాజీనామా చేశారు. అహర్నిశలు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశారు.

టీపీసీసీ పదవి దక్కకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయంగా భావించిన గాంధీ భవన్ మెట్లు జీవితంలో ఎక్కబోనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు. వైఎస్‌ఆర్ ఆత్మీయ సమ్మేళానికి ఎవరూ వెళ్లొందని టీపీసీసీ అల్టిమేటం జారీ చేసింది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఈ సమ్మేళానికి వెళ్లలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆత్మీయ సమ్మేళానికి వెళ్లారు. దింతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు అధిష్టానాన్నికి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేశారు.

తాజాగా కోమటిరెడ్డి పై కాంగ్రెస్ వర్గాల్లో కొత్తగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తరుచుగా కోమటిరెడ్డి బీజేపీ పెద్దలతో భేటీ అవుతున్నారు. కాంగ్రెస్ నేతలను కనీసం దగ్గరకు రనివ్వని కేంద్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి మాత్రం అడగకుండానే అపాయింట్మెంట్ ఇస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో ముక్యంగా రేవంత్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ లో ఉంటూనే కోమటిరెడ్డి బీజేపీకి పరోక్షంగా మద్దత్తు ఇస్తున్నారని రేవంత్ రెడ్డి వర్గం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు, రేవంత్ రెడ్డి వర్గాలు అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.