ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించాలి: మెట్టు సాయి కుమార్, కాంగ్రెస్ నేత

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించాలి: మెట్టు సాయి కుమార్, కాంగ్రెస్ నేత

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పై ఆర్మూర్ నియోజకవర్గం టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శలు చేశారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి దీంతో కాంగ్రెస్ ఫిషర్ మాన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ దీనిపై స్పందించారు. జీవన్ రెడ్డి ఎమ్మెల్యే అన్న విషయం మర్చిపోయి వింతగా ప్రవర్తిస్తున్నారని సాయి కుమార్ అన్నారు.టి పి సి సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పై ఆరోపణలు చేస్తేనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గుర్తింపు వస్తుందని అందువల్లనే అనవసర ఆరోపణలు రేవంత్ రెడ్డి పై చేస్తున్నారని సాయి కుమార్ తెలిపారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని గద్దె దించి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తుందని ఆ భయం కేసీఆర్కు ఉండటం వల్లే ఢిల్లీ వెళ్లి బిజెపి నాయకులను కలుస్తున్నారు అని సాయి కుమార్ అన్నారు. రాజకీయ సన్యాసులను చూశాం కానీ వీళ్లు రాజకీయ వ్యభిచారులు అంటూ సాయికుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి పై ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఇక నుంచి చూస్తూ ఊరుకోమని ఆయన అన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి మతిస్థిమితం సరిగా లేదని అందువల్లే ఆయన పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతున్నారని తనను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి లో చేర్పించడానికి 5 వేల ఆర్థిక సహాయం చేస్తాను అంటూ కాంగ్రెస్ ఫిషర్ మాన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.