టి తాగించి.. యువతిపై పలుమార్లు అత్యాచారం..

టి తాగించి.. యువతిపై పలుమార్లు అత్యాచారం..

ఆర్.బి.ఎం డెస్క్: ఒకవైపు ప్రజలు కరోనా సెగతో అల్లాడిపోతుంటే మరో వైపు కామాంధులు చెలరేగిపోతున్నారు. సమాజంలో ఇంకా ఎంత కఠినమైన చట్టాలు అమలు చేస్తే ఆ కామాంధులకు బుద్ధివస్తుందో? అలాంటి వారిని ప్రభుత్వాలు ఏమి చేయలేవు అనుకోని ఇలాంటి ఘటనలకు పాల్పడుతూ అమాయక మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మహిళలు సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలపై అవగాహనా పెంచుకోవాలి. అయితే తాజాగా ఒక యువతికి టీలో మత్తు మందు కలిపి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ముంబై మహా నగరంలో ఆలస్యంగా వెలుగు చూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 35 ఏళ్ళ వ్యక్తి, 24 ఏళ్ళ యువతి ఇద్దరు సామజిక మాధ్యమంలో పరిచయం అయ్యారు. గంటల తరబడి చాటింగులు చేస్తూ ఒకరి గురుంచి ఒకరు తెలుసుకున్నారు. వీరి పరిచయం రోజు రోజుకు చాల దృఢంగా మారింది.

ఆ వ్యక్తి తమ ఇంట్లో ఎవరు లేని క్రమంలో ఆ యువతిని తన నివాసానికి ఆహ్వానించాడు. దాంతో ఆ యువతీ గుడ్డిగా నమ్మి అతని కోరిక మేరకు ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళింది. ఆ వ్యక్తి అప్పటికే కామంతో రగిలిపోతూ అవకాశం కోసం ఎదురు చూశాడు. ఆ యువతికి అతిధి మర్యాదలు చేసే క్రమంలో ముందుగా టి ఇచ్చాడు. ఆ వ్యక్తి ముందుగానే అనుకున్న పథకం ప్రకారమే ఆ యువతికి ఇచ్చే టీలో మత్తు పదార్థం కలిపాడు. ఆ విషయం తెలియని ఆ యువతి అతను ఇచ్చిన టి తాగేసింది. ఆ టి తగిన కొద్దీ నిమిషాలకే ఆ యువతీ మత్తులోకి జారుకుంది.

యువతి టి తాగి మత్తులోకి జారీ స్పృహ కోల్పోయింది దాన్ని అదునుగా తీసుకొని ఆ కామాంధుడు ఆ యువతి నగ్న వీడియో తీశాడు. అనంతరం ఆమె పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. స్పృహలోకి వచ్చిన ఆ యువతికి జరిగిన విషయం వివరించాడు ఆ కామాంధుడు.

ఈ విషయాలు బయట పెడితే తాను తీసిన వీడియో సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దాంతో ఆ యువతి ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో ఆ యువతి నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని అనేక మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

రోజు రోజుకు యువతిపై ఆ కామాంధుడి వేధింపులు శృతిమించడంతో యువతి తన తల్లిదండ్రులకు విషయం తెలిపింది. దింతో వారు పోలీసులకు పిర్యాదు చేశారు.రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ యువతికి సంబంధించిన వీడియో లు చూస్తున్న క్రమంలో వేరే అమ్మాయిల వీడియోలు బయట పడ్డాయి. దింతో పోలీసులు అవాక్కయ్యారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published.