చెట్టంత మనిషిని బలి తీసుకున్న ఒక నిమ్మకాయ..!

చెట్టంత మనిషిని బలి తీసుకున్న ఒక నిమ్మకాయ..!

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: కరోనా మహమ్మారితో ఒక్కసారిగా మానవాళి జీవితం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి శాస్త్రవేత్తలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కాగా కరోనా మానవ శరీరంలోకి ప్రవేశించకుండా వివిధ రకాల జాగ్రత్తలు పాటిస్తున్నారు. కరొనను మనిషి శరీరం ఎదురుకోవడానికి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. ఈ క్రమంలో ప్రతి మనిషి రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నాడు. కొందరు యోగాలు చేసి రోగనిరోధక శక్తి పెంచుకుంటే మరికొందరు సామాజిక మాధ్యమాల్లో వచ్చే   హోమ్ రెమిడీస్ ను ఫాలో అవుతున్నారు. కరోనా కు బయపడి అది శరీరంలోకి ప్రవేశించకుండా ఉండేందు వింత వింత రెమిడీస్ ను ఫాలో అవుతూ చిక్కులో పడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో చూపించే హోమ్ రెమిడీస్ తో ఫలితం వస్తుందా రాదా అని కూడా ఆలోచించకుండా గుడ్డిగా వాటిని ఫాలో అవుతూ తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. ఈ క్రమంలో కరోనా శరీరంలోకి వస్తుందో లేదో కానీ ఆ చిట్కాలు పాటించి ఏకంగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సామజిక మాధ్యమంలో వచ్చిన ఒక చిట్కా నిండు ప్రాణాన్ని బలితీసుకున్న దారుణ ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది.

కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో బసవరాజ్ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేయడంతో విద్యార్థులకు ఆన్లైన్ లో  బోధిస్తున్నాడు. కాగా బసవరాజ్ కాలి సమయంలో సామాజిక మాధ్యమాల్లో కొత్త కొత్త అంశాలను తెలుసుకుంటూ ఉంటాడు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికి అప్పుడు వచ్చే చిట్కాలను తరుచు చూస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటాడు. ఈ మధ్య కాలంలో కరోనా రాకుండా ముక్కులో నిమ్మాయక పిండుకుంటే కరోనా వచ్చే అవకాశం చాల తక్కువగా ఉంటుంది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచింది. బసవరాజ్ కూడా ఆ చిట్కాను చూశాడు. ముక్కులో నిమ్మకాయ పిండుకుంటే కరోనా తన దారికి చేరదనే గుడ్డి నమ్మకంతో తన ముక్కులో నిమ్మకాయ పిండుకున్నాడు. నిమ్మకాయ పిండుకున్న అతి తక్కువ సమయంలోనే బసవరాజ్ తీవ్ర అనారోగ్యానికి లోనయ్యాడు. తీవ్ర అస్వస్థతతో కొట్టుమిట్టులాడుతున్న బసవరాజ్ ను కుటుంబ సభ్యులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తున్న క్రమంలో బసవరాజ్ ప్రాణాలను కోల్పోయారు. ఒక చిన్న నిమ్మకాయ చెట్టంత మనిషిని బలి తీసుకోవడంతో ఆ కుటుంబ సభ్యులంతా శోక సముద్రంలో మునిగిపోయారు.

Leave a Reply

Your email address will not be published.