ప్రేమించి వివాహాం చేసుకున్న ఎమ్మెల్యే ..
చెన్నై:త్యాగదుర్గం మలైకోటై గ్రామానికి చెందిన అర్చకుడి కూతుర్ని ప్రేమించి వివాహాం చేసుకున్న అన్నాడీఎంకే కళ్లకురిచ్చి ఎమ్మెల్యే ప్రభు. ఇరు కుటుంబీకుల అంగీకారం మేరకు ఎమ్మెల్యే ప్రభు వివాహం నిరాడంబరంగా పెద్దల సమక్షంలో ఘనంగా జరిగింది. బీఏ ఇంగ్లిష్ రెండో ఏడాది చదువుతున్న సౌదర్యను ఎమ్మెల్యే ప్రభు గత ఒక్క ఏడాదిన్నరగా ప్రేమిస్తున్నాడు. తాజాగా వారి విషయం పెద్దలకు చెప్పి ఇరువురు దైవ సాక్షిగా ఒక్కటయ్యారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ వివాహం జరిగింది. కరోనా తీవ్రత ఎక్కువ ఉండటంతో ఈ వివాహానికి రాజకీయ ప్రముఖులు హాజరుకాలేకపోయారు. కేవలం కుటుంబ సభ్యులు మరియు కావాల్సిన వారు మాత్రమే ఈ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.