దుబ్బాక తెరాస అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్..
దుబ్బాక: దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థిని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. తెరాస దుబ్బాక అభ్యర్థి ఎవరని అందరూ చూస్తున్న సందర్భం లో కేసీఆర్ దానికి తెర దింపారు దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగ రెడ్డి భార్యను అధికారికంగా ప్రకటించారు. రామలింగ రెడ్డి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు కేసీఆర్ తో పాటు ఉద్యమం లో క్రియాశీల పాత్ర పోషించారు. ఉద్యమాల్లోనే కాకుండా పార్టీ బలోపేతం కోసం హాహార్నిశలు కష్టపడ్డా వ్యక్తి రామలింగ రెడ్డి. దుబ్బాక నియోజకవర్గం అభివృద్దే ధ్యేయంగా పనిచేసిన నాయకుడు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేసిన మహా నాయకుడు సోలిపేట రామలింగ రెడ్డి. అయన తుది శ్వాస వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి. అయితే రామలింగ రెడ్డి భార్యను దుబ్బాక అభ్యర్థిగా ప్రకటించే ముందే అక్కడి నాయకుల, ప్రజలు సలహా తీసుకునే తుది నిర్ణయాన్ని తీసుకున్న అధిష్టానం.