తాజ్‌మహల్‌పై మరో వివాదం..

తాజ్‌మహల్‌పై మరో వివాదం..

ఢిల్లీ: తాజ్‌మహల్‌పై సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. తాజ్‌మహల్‌ను షాజహాన్ నిర్మించలేదని, షాజహాన్ నిర్మించారనడానికి చారిత్రక ఆధారాలు లేవని డాక్టర్ రజనీష్ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజ్‌మహల్ నిజమైన చరిత్రను తెలుసుకోవడానికి కమిటీని ఏర్పాటు చేయాలంటూ పిటిషన్‌లో కోరారు. ఈ నెల 10 తర్వాత పిటిషన్‌ను న్యాయస్థానం విచారించనుంది. గతంలో ఇదే అభ్యర్థనతో డాక్టర్ రజనీష్ సింగ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషనర్ గతంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్‌కు సమాచార హక్కు దరఖాస్తు చేశారు. దీనికి ఎన్‌సీఈఆర్‌టీ బదులిస్తూ, మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య కోసం తాజ్‌మహల్‌ను నిర్మించినట్లు ప్రాథమిక ఆధారాలు అందుబాటులో లేవని పేర్కొంది. అదేవిధంగా పిటిషనర్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కూడా దరఖాస్తు చేశారు. అక్కడ కూడా రజనీష్ సింగ్ సంతృప్తికరమైన సమాధానాన్ని దొరకలేదు.

Leave a Reply

Your email address will not be published.