73 ఏళ్ళ బామ్మకు వరుడు కావలెను.. ఆరోగ్యంగా దృడంగా ఉండాలి

73 ఏళ్ళ బామ్మకు వరుడు కావలెను.. ఆరోగ్యంగా దృడంగా ఉండాలి

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: మనం రోజు వారి వార్త పత్రికల్లో ఎన్నో వ్యాపార వాణిజ్య ప్రకటనలు చూస్తుంటాం అదేవిధంగా జాబ్స్ కావాలి అని వరుడు కావాలి అని వధువు కావాలి,పుట్టినరోజు శుభకాంశాలు తెలుపుతూ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇలా ఎన్నో రకాల యాడ్స్ మనం వార్త పత్రికల్లో రోజు చూస్తుంటాం. అయితే తాజాగా ఇప్పుడొక వార్త నెట్టింట్లో బాగా వైరల్ ఆవుతోంది.

73 ఏళ్ళ బామ్మా తనకు బాయ్ ఫ్రెండ్ కావాలని ఏకంగా వార్త పత్రికలో ప్రకటన ఇచ్చింది. బెంగళూరు నగరానికి చెందిన 73 ఏళ్ళ బామ్మ తన భర్తతో పలు కారణాల వల్ల విడాకులు తీసుకుంది. ఈ క్రమంలో బామ్మ ఒంటరిగా కావడంతో తనకంటూ జీవిత భాగస్వామి కావాలని చివరి వరకు తనతో ఉండే వ్యక్తి కావాలని నిర్ణయించుకుంది బామ్మ.

దీనికోసం స్వయంగా ఆమె పత్రిక ఆఫిసుకు వెళ్లి వరుడు కావాలని ప్రకటన ఇచ్చింది. బామ్మకు 73 ఏళ్ళు వయసు కావడంతో తనకంటూ ఒక్క తోడు కావాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే వరుడు బామ్మకంటే వయసులో పెద్దవాడై ఉండాలి ఆరోగ్యాంగా ఉండాలని ఆమె పేర్కొంది. బామ్మ బ్రాహ్మణ కుటుంబానికి చెందిది కాబ్బటి తనకు బ్రాహ్మణ వరుడు కావాలని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *