జగన్ బెయిల్ రద్దుపై హైకోర్టుకు రఘురామ… రఘురామను తప్పుబట్టిన హైకోర్టు
ఆర్.బి.ఎం హైదరాబాద్: సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. జగన్, విజయసాయిరెడ్డిల బెయిలు రద్దుచేయాలని దాఖలైన పిటిషన్లను సీబీఐ కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రఘురామ హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ల బదిలీకి హైకోర్టు నిరాకరింది. నిందితులు ఇతర దేశాలకు వెళ్లడానికి అనుమతించినంత మాత్రాన కోర్టులనే అనుమానిస్తారా అని రఘురామను కోర్టు ప్రశ్నించింది. పరిస్థితులకు అనుగుణంగా నిందితులు విదేశాలకు వెళ్లడానికి ప్రత్యేక కోర్టులు అనుమతించడం సాధారణమేనని, తామూ ఇలా చాలామందికి అనుమతులిచ్చామని న్యాయస్థానం గుర్తుచేసింది. అంతమాత్రాన కోర్టులను సందేహిస్తూ కేసు బదిలీ చేయాలని ఎలా కోరతారని రఘురామను ప్రశ్నించింది.