మేము రహస్యంగా భేటీ కాలేదు తొందరలోనే ఆయనను కలుస్తాం: అనిరుధ్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఆర్.బి.ఎం డెస్క్: రహస్యంగా పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు అనే వార్త అటు సామాజిక మాధ్యమాల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లో తెగ చెక్కర్లు కొడ్తూ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పందించారు. మేము రహస్యంగా సమావేశం అవ్వలేదని నియోజకవర్గాల అభివృద్ధి కోసమే కలిసామని ఆయన చెప్పుకొచ్చారు. మేమందరం కలుసుకోవడం ఏమైనా తప్ప అంటూ ఆయన ప్రశ్నించారు. తను ఏ మంత్రి దగ్గర కూడా ఏ ఫైల్ పెట్టలేదని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు అయితే తొందరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి మరిన్ని విషయాలు ఆయనతో చర్చిస్తానని సామాజిక మాధ్యమం ద్వారా అనిరుద్ రెడ్డి తెలియజేశారు