ఇళ్ల నిర్మాణాలకు మెటీరియల్ కొరత రాకుండా చూడాలి…

ఇళ్ల నిర్మాణాలకు మెటీరియల్ కొరత రాకుండా చూడాలి…

ఆర్.బి.ఎం: జగనన్న కాలనీ లే అవుట్ లో త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది కృషిచేయాలని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.గురువారం మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, మున్సిపల్ కమీషనర్ రాంబాబు, హౌంసింగ్ అధికారులతో కలసి శ్రీకాంత్ రెడ్డి రాయచోటి పట్టణ పేదల కోసం నిర్మితమవుతున్న జగనన్న కాలనీ లే అవుట్ ను సందర్శించారు. లే అవుట్ లో కలియ తిరిగి వివిధ దశల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణం పనులును పరిశీలించారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలలో వేగం పెంచేలా లబ్ధిదారులను చైతన్యం చేయాలని ఆయన సచివాలయ అధికారులు, ప్రజా ప్రతినిధులు, అధికారులును కోరారు.ఇళ్ల నిర్మాణా లకు స్టీలు, సిమెంట్, ఇసుక తదితర మెటీరియల్ కొరత రాకుండా చూడాలని లే అవుట్ నుండే ఆయన కలెక్టర్ గిరీష ను ఫోన్ ద్వారా కోరారు. ఈదురుగాలులు, వర్షాల వల్ల దెబ్బతిన్న విద్యుత్ లైన్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరపరా అందించాలని ఆయన అధికారులును ఆదేశించారు.

రూ 4.21 కోట్ల నిధులుతో ఇళ్ల నిర్మాణాలకు నీటి వసతి సౌకర్యాలును త్వరితగతిన కల్పించుటకు చర్యలు చేపట్టాలని సూచించారు. సిమెంట్ గోడౌన్లను ఇతర ప్రాంతాలలో కాకుండా స్థానికంగానే ఏర్పాటు చేసి లబ్దిదారులకు సౌకర్యం ఉండేటట్లు చూడాలన్నారు.జిల్లాలోనే పెద్ద లే అవుట్ అయిన ఈ లే అవుట్ లో రహదారులు, పార్క్ ల నిర్మాణం తదితరమౌలిక వసతులు కల్పనతో ఆదర్శ లే అవుట్ గా తీర్చిదిద్దుతామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఫయాజ్ అహమ్మద్, జానం రవీంద్ర యాదవ్, రియాజ్,వసంత శ్రీనివాసులు రెడ్డి, మున్సిపల్ ఏఈ కృష్ణారెడ్డి, విద్యుత్ ,హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.