జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సీఎం..!

జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సీఎం..!

ఆర్.బి.ఎం డెస్క్: మచిలీపట్నంకి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు కాగిత వెంకట్రావువ్ ఇటీవల అనారోగ్యంతో  మరణించారు. అయన మరణంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాగిత వెంకట్రావువ్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఈ రోజు బందరు చేరుకున్నారు.

బందరుకు చేరుకున్న చంద్రబాబు నాయుడికి టీడీపీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అయితే ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సీఎం అంటూ నినాదాలు చేస్తూ తారక మంత్రం జపించారు. జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సీఎం అంటూ జండాలు, ఫ్లెక్సీలు బ్యానెర్లు ఏర్పాటు చేశారు. ఏకంగా చంద్రబాబు నాయుడు ముందే కార్యకర్తలు పార్టీ జెండాలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ జెండాలను ప్రదర్శిస్తూ తారక మంత్రం జపించారు. ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫొటోతో కూడిన జండాలపై కాబోయే ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అంటూ ఇంగ్లీష్ లో రాశారు.

గతంలో కూడా చంద్రబాబు నాయుడుని కొందరు టీడీపీ కి చెందిన నాయకులు ఎన్టీఆర్ ను పార్టీలోకి ఆహ్వానిస్తారా అని అడిగిన ప్రశ్నకు చంద్రబాబు నాయుడు నుండి ఎలాంటి స్పందన రాలేదు. టీడీపీ పార్టీని బలోపేతం చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలో కు తేవాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే టీడీపీలో నూతన ఉత్సాహం వస్తుందని యువకులంతా ఎన్టీఆర్ తో కలిసి నడుస్తారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.