చంద్రబాబుకు భారీ షాక్… సొంత ఊరిలో చిత్తుచిత్తుగా ఓడిన టీడీపీ చిత్తూరు:

చంద్రబాబుకు భారీ షాక్… సొంత ఊరిలో చిత్తుచిత్తుగా ఓడిన టీడీపీ
చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. ఆయన స్వంత గ్రామం నారావారిపల్లెలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి చేతిలో దారుణంగా ఓడిపోయారు. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గంగాధరంపై, వైసీపీ అభ్యర్థి రాజయ్య భారీ మోజార్టీతో గెలిచారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా టీడీపీ అభ్యర్థులు, వైసీపీ అభ్యర్థుల దాటికి నిలవలేకపోయారు. చంద్రబాబు నియోజకవర్గ కేంద్రం కుప్పంలోని సడుమూరు ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీ అభ్యర్థి 23 ఏళ్ల అశ్విని కైవసం చేసుకున్నారు. సొంత ఊరు.. సొంత నియోజకవర్గంలో టీడీపీ ఓడిపోవడంతో ఆ పార్టీ నేతలు ఆందోళనలో ఉన్నారు.

2019 ఎన్నికల్లో చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో టీడీపీ ఘోరంగా ఓటమి పోయింది. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల రూపంలో మరో పరాభవం ఎదురైంది. ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా టీడీపీ ఓడిపోయింది. ఈసారి తన సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలో కూడా చంద్రబాబు ప్రభావం చూపించలేకపోయారు.

నియోజకవర్గంలో మొత్తం 4 మండలాలుంటే.. అన్ని మండలాల్లో వైసీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. కుప్పం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలుంటే 17 వైసీపీ కైవసం చేసుకుంది. అటు గుడిపల్లెలో 12 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాల్లో 12 స్థానాల్లో వైసీపీ గెలిచింది. రామకుప్పంలో 16కి 16 ఎంపీటీసీలు వైసీపీ ఖాతాలో పడ్డాయి. ఇదే బాటలో జడ్పీటీసీ ఫలితాలు కూడా వెలువడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published.