నా రాజీనామా ఆమోదించండి: గంటా శ్రీనివాసరావు

నా రాజీనామా ఆమోదించండి: గంటా శ్రీనివాసరావు

ఆర్.బి.ఎం విశాఖపట్నం: తన రాజీనామాను ఆమోదించాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరోసారి స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రవేటీకరణను వ్యతిరేకిస్తూ గత ఏడాది గంటా తన రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపారు. అప్పుడు స్పీకర్ ఫార్మేట్‌లో లేదని రాజీనామా లేఖను తమ్మినేని వెనక్కి పంపారు. తిరిగి ఏక వ్యాక్యంలో మరో లేఖను గంటా పంపారు. రాజీనామా లేఖ తర్వాత స్వయంగా స్పీకర్‌ను గంటా కలిసి తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అయినా ఏడాది గడుస్తున్న తన రాజీనామాపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో తిరిగి గంటా మూడోసారి లేఖ రాశారు.

ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ప్రవేటీకరణను వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఏడాది నుంచి అలుపెరుగని పోరాటం చేస్తున్నారని తెలిపారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తనకు సామాజిక హోదా, గుర్తింపు, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన విశాఖఫట్నం కోసం ఈ పదవీ త్యాగం చాలా చిన్నదని పేర్కొన్నారు. దయచేసి తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌ను మరోసారి గంటా కోరారు.

Leave a Reply

Your email address will not be published.