7th సెన్స్ సినిమాలో లాగే..చైనా వైరస్ కీ నెల్లూరులో భారతీయ ఆయుర్వేదం..

7th సెన్స్ సినిమాలో లాగే..చైనా వైరస్ కీ నెల్లూరులో భారతీయ ఆయుర్వేదం..

ఆర్.బి.ఎం డెస్క్: యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న చైనాలో పురుడుపోసుకున్న వైరస్ ను భారతీయ ఆయుర్వేద పద్దతిలో దాన్ని భారీ నుండి రక్షిస్తాం అంటూ నెల్లూరు కు చెందిన  నాటు వైద్యుడు బొనిగే ఆనందయ్య అంటున్నారు. తన వద్ద ఇప్పటివరకు 30వేలకు పైగా ఔషధం తీసుకున్న జనం మాస్క్ లేకుండా ధైర్యంగా తిరుగుతున్నారని అయన అన్నారు. తన వద్ద ఔషధం తీసుకున్న వారిలో ఎలాంటి చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాలేవని అయన అన్నారు. కరోనా పాజిటివ్ ఉన్న వారికి రెండు రోజుల్లో నెగెటివ్ వస్తుందని, నెగెటివ్ ఉన్నవారికి ఆ వైరస్ జన్మలోదరిచేరదని వారు తెలిపారు. ఈ క్రమంలో అయన వద్దకు ప్రజలు తండోపతండాలుగా బారులు తీరుతున్నారు. 11వేల జనాభా ఉన్న మేజర్ పంచాయితీ కృష్ణపట్నంలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని అయన ధీమా వ్యక్తం చేశారు. ఔషధంలో వాడే పదార్ధాలు కూడా మన చుట్టూ ఉండేవే అని బొనిగే ఆనందయ్య అన్నారు. కరోనా విరుగుడు మందును మన ఇంట్లో లభ్యమయ్యే  పచ్చ కర్పూరం, మిరియాలు, ధనియాలు, పసుపు, తేనె, వంటివి ఇంకొన్ని పదార్థాలతో తాయారు చేసుకోవచ్చని అయన అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారని, తాను మాత్రం తన వైద్యానికి ఎలాంటి డబ్బులు తీసుకోవడం లేదని అయన అన్నారు.

పైన తెలిపిన వివరాలు సామాజిక మాధ్యమంలో నుండి సేకరించబడాయి.  సామజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతి చిట్కాను ప్రజలు స్వయంగా వాడకుండా వైద్యుల సూచనలను పాటించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *