యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కు డిఫ‌రెంట్ గా యానిమేష‌న్ వీడియోతో  బ‌ర్త్ డే విషెస్ తెలిపిన  `ఆవారా జింద‌గి` చిత్ర టీమ్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కు డిఫ‌రెంట్ గా యానిమేష‌న్ వీడియోతో  బ‌ర్త్ డే విషెస్ తెలిపిన  `ఆవారా జింద‌గి` చిత్ర టీమ్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్:  మాస్‌, క్లాస్ స‌హా అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేస్తూ వారి హృద‌యాల్లో తిరుగులేని ఇమేజ్‌ను ద‌క్కించుకున్న టాలీవుడ్ బాద్‌షా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. ద‌గ్గ‌రి వాళ్లు ముద్దుగా తార‌క్ అని, అభిమానులు యంగ్ టైగ‌ర్ అని అభిమానంగా పిలుచుకునే ఈ స్టార్ హీరో.. వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ ఒక్కో మెట్టు ఎదుగుతూ పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. పాత్ర ఏదైనా త‌న‌దైన న‌ట‌న‌, డాన్సులు, పెర్ఫామెన్స్‌తో ఆక‌ట్టుకునే ఈ స్పాంటేనియ‌స్ యాక్ట‌ర్ పుట్టిన‌రోజుని (మే 20) పురస్క‌రించుకుని ఈ రోజు `ఆవారా జింద‌గి` చిత్ర టీమ్ ఆయ‌న‌పై ఓ వినూత్న‌మైన యానిమేష‌న్ వీడియోతో బ‌ర్త్ డే విషెస్ తెలిపింది.

గ‌తంలో సాయి రామ్ శంక‌ర్‌, శ‌ర‌త్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో `నేనొకర‌కం` చిత్రాన్ని నిర్మించిన విభ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తాజాగా `ఆవారా జింద‌గి` చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో బి.మ‌ధుసూద‌న్ రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీహ‌న్‌, అనుప‌మ్‌, లంబు మ‌రియు షాయాజీ షిండే ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.  చాలా వర‌కు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓ డిఫ‌రెంట్ క‌థాంశంతో తెర‌కెక్కుతోంది.  త్వ‌ర‌లో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు.,

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ఈ రోజు పుట్టిన రోజు జ‌రుపుకుంటోన్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గారికి  మా ` ఆవారా జింద‌గి` టీమ్ త‌ర‌పున యానిమేష‌న్ వీడియోతో బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ప్ర‌స్తుతం దీనికి యూట్యూబ్ లో, సోష‌ల్ మీడియాలో మంచి స్పంద‌న వ‌స్తోంది`. త్వ‌ర‌లో మా సినిమాకు సంబంధించిన  మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డిస్తాం“ అన్నారు.

Leave a Reply

Your email address will not be published.