మున్సిపల్ స్థలాల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత -రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమన్వయంతో పనిచేయాలి..

మున్సిపల్ స్థలాల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత -రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమన్వయంతో పనిచేయాలి..

ఆర్.బి.ఎం: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల అలసత్వాన్ని ఎట్టిపరిస్థితులోనూ క్షమించబోమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మున్సిపల్ సభాభవనంలో మున్సిపల్ కార్యవర్గం సాధారణ సర్వసభ్య సమావేశం ఛైర్మన్ ఫయాజ్ బాష అధ్యక్షతన జరిగింది. మున్సిపల్ ఆస్థుల అన్యాక్రాంతంపై సమావేశంలో చర్చజరిగింది. మున్సిపా లిటీ స్థలాలు ఆక్రమణల తొలగింపులో అధికారులు స్పందిస్తున్న తీరుబాగా లేదంటూ కౌన్సిలర్లు కొలిమి చాన్ బాష, హారూన్ బాష, విజయమ్మ,నాయకులు సలీమ్, ఫయాజ్ అహమ్మద్ తదితరులు మండిపడ్డారు. పట్టణంలోని పాతబస్టాండు స్థలం పరిరక్షణ అంశం పైన అధికారులు తగినంత శ్రద్ధ చూపడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. పట్టణంలో మున్సిపల్ స్థలాల అంశంపై కమిషనర్ తో పాటు అధికారులందరికి సరైన అవగాహన లేదంటూ ఆగ్రహించారు. పట్టణంలోని సర్వే నంబరు 679/2 లోని స్థలంను చక్రవర్తి అనే వ్యక్తి తన పేరుమీద అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారంటూ కౌన్సిలర్ విజయమ్మ ఆరోపించారు. ఆవిషయంపై అధికారులు విని మరో సర్వీసెంబరు వేసి డిస్టర్ చేసారని చెబతున్నప్పటికీ సదరు స్థలం వివాదంలో కమిషనర్ రాంబాబు పటించుకోవడం లేదంటూ ఆగ్రహించారు.

ముఖ్యఅతిధిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి స్పందిస్తూ మున్సిపల్ స్థలాలను వెంటనే గుర్తించి వాటి పరిరక్షణకు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ అధి కారులను ఆదేశించారు. ఆమేరకు మున్సిపల్ స్థలాల జాబితాను పాలకవర్గ సభ్యులకు అందచే యాలంటూ కోరారు. స్థలాల గుర్తింపు విషయంలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలంటూ సూచించారు. ఒక్క సెంటు మున్సిపల్, రెవెన్యూ స్థలం అన్యాక్రాంతమైన సహించబోమంటూ ఆయన అధికారులను హెచ్చరించారు. పట్టణంలో నిర్వహిస్తున్న గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించి చేపట్టాలని నిర్ణయించిన అభివృద్ధి పనులను వారం రోజులలోపు చేపట్టాలంటూ ఆయన మున్సిపల్ డీఈ సుధాకర్ నాయక్, ఎఈ వెంకట క్రిష్ణారెడ్డి లను ఆదేశించారు. అత్యవసరమైన పనులు కాబట్టి నామినేషన్ పద్ధతిపై వెనువెంటనే చేపట్టాలంటూ సూచించారు. పట్టణ ప్రజల సౌకర్యార్థం ప్రస్తుతమున్న షాదీఖానాకు అవసరమైన మరమ్మతులు చేపట్టి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలంటూ కోరారు. ఇదే సమయంలో మరో నూతన ప్రాదీఖానా నిర్మాణం కోసం ఒక ఎకరా స్థలసేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలంటూ కోరారు.

పట్టణంలోని ప్రజలకు అత్యవసరమైన స్మశానవాటికల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను వెంటనే గుర్తించాలంటూ కోరారు. స్థలాల కొరత నేపథ్యంలో ఎలక్ట్రికల్ స్మశానవాటిక ఏర్పాటు విషయమై కూడా ఆలోచన చేద్దామంటూ అధికారులతో అన్నారు. నాయకులు పల్లా రమేష్ సూచనల మేరకు గాలివీడు రోడ్డులో మాండవ్య నది ఒడ్డున ఉన్న స్మశానవాటికలో కంపచెట్లు తొలగించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలంటూ కోరారు. పట్టణం నడిబొడ్డున ఉన్న రైతుబజారు నిరుపయోగంపై సభ్యులు చర్చించారు. ఇందుకు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి స్పందిస్తూ కోట్లు వెచ్చించి నిర్మించిన రైతుబజారును వెంటనే వినియోగంలోకి తెచ్చేలా చర్యలుతీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. వ్యాపారస్తులు, రైతులతో చర్చించి రైతుబజారులో విక్రయాలు జరిగేలా చూడాలంటూ కోరారు. పట్టణంలో సాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులను మరింత వేగవంతం చేయాలంటూ కోరారు. పట్టణంలో నిర్మించాల్సిన ఓహెచ్ ఆర్ ల నిర్మాణం పనులను వెంటనే మొదలు పెట్టించి త్వరగా పూర్తిచేయిందాలన్నారు. పట్టణంలో ఏర్పాటు చేయతలపెట్టిన నాలుగు సోలార్ వాటర్ ప్లాంట్ల పనులను వెంటనే మొదలు పెట్టించాలంటూ కోరారు.

ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను చూపడంతో పాటు 2,3 నెలలో వాటిని వినియోగంలోకి తెచ్చి ప్రజల దాహార్తిని తీర్చేలా చూడాలంటూ కోరారు. కొత్తపురమ్మ ఎల్ సి సి ఎస్ కు నామినేషన్ పద్దతి కింద పనులు అప్ప చెప్పడంపై కౌన్సిలర్ విజయమ్మ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇందుకు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి స్పందిస్తూ అత్యవసర పనులైతే తప్ప వీటిని నామినేషన్ పద్దతి కింద చేపటవద్దంటూ కమిషనర్ రాంబాబును కోరారు. వీలైనంత వరకు పనులను టెండర్ల ద్వారా పూర్తి చేయించాలంటూ సూచించారు. పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి ప్రహరిగోడ ముందు భాగంలోని పేఅండ్ యూజ్ టాయిలెట్ల నిర్వహణను గడువును సానిటేషన్ లేబర్ వెల్ఫేర్ సొసైటీ పొడిగించడంపైన సభ్యులు అభ్యంతరం చెప్పారు. పట్టణంలో నిరాశ్రయుల వసతిగృహం నిర్వహణలో లోపాలున్నాయని, కేంద్రం నిర్వాహకులకు బిల్లులు చెల్లించడంపై విచారణ జరపాలంటూ కౌన్సిలర్ ఛాన్ బాష తదితరులు అభ్యంతరం చెప్పారు. దీంతో వాటిపై విచారణ అనంతరమే అనుమతులు యివ్వాలంటూ పాలకవర్గం తీర్మానించింది. అభివృద్ధి పనులను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చేపట్టాలంటూ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అధికారులకుp సూచించారు. 14వ ఆర్ధిక సంఘం &. 15 వ ఆర్ధిక సంఘం నిధుల వినియోగంపై సుదీర్ఘ చర్చ జరిగింది.

సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజర్ రెహమాన్, సభ్యులు గౌస్ ఖాన్, అల్తాఫ్, రౌనక్ హుస్సేన్, ఎస్ పి ఎస్ జబీఉల్లా, చంద్రశేఖర్, కొలిమి హారూన్, పద్మావతి, ఆసిస్అలీ ఖాన్ , నరసింహరెడ్డి, సుగవాసి ఈశ్వర్, జయన్న నాయక్. కో-ఆప్షన్ సభ్యులు అయ్యవారురెడ్డి, ఆసిఫ్ అలీఖాన్, వైఎస్ ఆర్సిపి నేతలు జానం రవీంద్ర, షబ్బీర్ ,ఫయాజ్ అహమ్మద్, కాంట్రాక్టర్ రియాజ్, పల్లా రమేష్. బుజ్జిబాబు, ఆనంద రెడ్డి, నిస్సార్, సుగవాసి శ్యామ్ కుమార్ , అన్నయ్య,సలీం,గవాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.