పెన్షన్ల విషయంలో ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.

పెన్షన్ల విషయంలో ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.

ఆర్.బి.ఎం: పెన్షన్ల విషయంలో ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాయచోటిలోని వై ఎస్ ఆర్ సీపీ కార్యాలయంలో శ్రీకాంత్ రెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ.. పెన్షన్ల విషయంలో జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. మనిషికి రూ 75 పెన్షన్లు ఇచ్చింది చూసాం.. పెన్షన్ అందుకుంటున్న మనిషి చనిపోతేనే కొత్త పెన్షన్ వచ్చే పరిస్థితులును గత ప్రభుత్వాలలో చూసామన్నారు. అటువంటి పరిస్థితుల నుంచి పెన్షన్ మొత్తాన్ని పెంచి పరిపూర్ణస్థితిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో ఒకేసారి లక్షలాది పెన్షన్లను మంజూరు చేయడం జరిగిందన్నారు.

అర్హతకు ప్రాధాన్యత ఇవ్వకుండా జన్మభూమి కమిటీలుపెట్టి, మా దగ్గరికి వస్తేనే పెన్షన్లు ఇస్తామని గత ప్రభుత్వంలో చెప్పేవారన్నారు. ఎన్నికలకు ముందు ఒక నెల రూ 2 వేలు పెన్షన్ ఇచ్చారన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చే నాటికి 44 లక్షల పెన్షన్లు ఇచ్చేవారన్నారు. ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల కాలంలోనే 18 లక్షల పెన్షన్లు పెరిగాయన్నారు.62 లక్షల మందికి రూ 2250 చొప్పున ప్రతినెలా రూ 1600 కోట్లను ఒకటవ తేదీన ఇంటివద్దకే ప్రభుత్వం పెన్షన్లును అందిస్తోందన్నారు. నెలకు రూ 300 నుంచి 400 కోట్ల రూపాయలను ఇచ్చే పరిస్థితులు గత ప్రభుత్వంలోఉండేవని, ఈ ప్రభుత్వం నాలుగింతలు ఎక్కువగా ఖర్చు పెడుతోందన్నారు.

రాయచోటి నియోజకవర్గానికి వస్తే ఈ రెండేళ్లలో 9500 పెన్షన్లు పెరిగాయన్నారు. ప్రతి నెల అర్హత ఉన్నవారికి నూతన పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతోందన్నారు.గత ప్రభుత్వంలో ఎన్ని పెన్షన్లు ఇచ్చారు, ఈ ప్రభుత్వంలో ఎన్ని పెన్షన్లు వస్తున్నాయో లెక్కలు చూడాలన్నారు. గత ప్రభుత్వంలోనే కార్డుకొక పెన్షన్ విధానానికి జిఓ ఇచ్చిన విషయం అందరికీ తెలుసునన్నారు. పెన్షన్లు తొలగిస్తున్నారని కొంతమంది పనిగట్టుకుని రాజకీయ విమర్శలు చేస్తున్నారన్నారు.అర్హత ఉన్న ఏ ఒక్కరికీ పెన్షన్ పోదన్నారు.ఈ కె వై సి అప్ డేట్ తో మల్లీ పెన్షన్లు అవుతాయన్నారు. నియోజక వర్గంలోని డబుల్ పెన్షన్లు లాంటి 700 ఉన్నాయని , మల్లీ అప్రూవల్ అవుతాయన్నారు.

ఏ ఒక్కరికీ పెన్షన్ పోయే ప్రశ్నే ఉండదని ఆయన స్పష్టం చేశారు.అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందుతుందని, ఒక వేళ పొరపాటున తీసేసినా తిరిగి అందుతుందన్నారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై ఇతర ప్రాంతాలకు జీవన భృతికోసం వెళ్లిన వారి పెన్షన్లును తొలగించొద్దని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు ఇచ్చారన్నారు.ప్రతి నెలా పెన్షన్లను ఒకటవ తేదీనుంచి ఐదవ తేదీలోగా తీసుకుంటే ఉపయోగం ఉంటుందన్న ఉద్దేశ్యంతో ఈ పద్ధతిని పెట్టారన్నారు.అర్హత ఉండి పెన్షన్ రానివారికి పార్టీలకతీతంగా తోడుగా ఉంటామన్నారు. ఉద్యోగులున్న కారణంగా పెన్షన్లు పొయేటట్లయితే కుటుంభ రేషన్ కార్డ్ లో వారి సదరు ఉద్యోగుల పేరును తొలగించుకుంటే పెన్షన్ వస్తుందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.