ఉపాధి హామీ పథక అమలులో రాయచోటి నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలి: శ్రీకాంత్ రెడ్డి 

ఉపాధి హామీ పథక అమలులో రాయచోటి నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలి: శ్రీకాంత్ రెడ్డి

  • రైతులకుపయోగపడే పనులను రూపొందించాలి
  • అవెన్యూ ప్లాంటేషన్ క్రింద నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి
  • ఉపాధి హామీ పథకం, వై ఎస్ ఆర్ జలకళ, అవెన్యూ ప్లాంటేషన్, ఉద్యానవనం, పార్క్ లు తదితర అభివృద్ధి పనులుపై సమీక్షించిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

ఆర్.బి.ఎం డెస్క్: ఉపాధి హామీ పథకం అమలులో రాయచోటి నియోజక వర్గాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేలా అధికారులు కృషిచేయాలని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సూచించారు. మంగళవారం తన కార్యాలయంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ల ఏ పి డి లు రవికుమార్, వెంకట్రామిరెడ్డి లతో నియోజకవర్గ పరిధిలో జరుగుచున్న ఉపాధి హామీ పథకం, వైఎస్ఆర్ జలకళ, అవెన్యూ ప్లాంటేషన్, ఉద్యాన వనం, పార్క్ ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులుపై శ్రీకాంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు పరచాలన్నారు.

పని కావాలన్న ప్రతి ఒక్కరికీ పని కల్పించాలన్నారు.రైతులకుపయోగపడే పనులను రూపొందించాలని సూచించారు. అర్హులందరికీ వై ఎస్ ఆర్ జలకళ క్రింద బోర్లును మంజూరు చేయాలని ఆదేశించారు. అవినీతి,అక్రమాలకు చోటివ్వకుండా పారదర్శకంగా పథకాన్ని అమలు పరచాలని సూచించారు.కరోనా నేపథ్యంలో కూలీలు అత్యంత జాగ్రత్తలుతో పనులు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.వైఎస్ఆర్ జలకళ క్రింద చిన్నమండెం, రాయచోటి, సంబేపల్లె మండలాలకు సంబంధించి 980 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు,778 మంది వి ఆర్ ఓ లాగిన్ లో అప్రూవ్ అయ్యాయి, జియాలజిస్ట్ సర్వే 155 బోర్లకు పూర్తయింది. ఇందులో 75 మందికి బోర్లు వేయడం జరిగిందని, రామాపురం, లక్కిరెడ్డిపల్లె ,గాలివీడు మండలాల పరిధిలో 1417 వై ఎస్ ఆర్ జలకళ దరఖాస్తులు రాగా,87 మంజూరు అయ్యాయని,28 బోర్లు డ్రిల్ చేయడం జరిగిందని అధికారులు చీఫ్ విప్ కు వివరించారు.

నీళ్లు పడిన బోర్లకు విద్యుత్ సర్వీసును అందించే సంబంధిత మండల విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్లు సర్వే చేపట్టి అంచనాలను త్వరితగతిన తయారయ్యేలా చర్యలు తీసుకోవాలని చీఫ్ విప్ సూచించారు. నియోజక వర్గ పరిధిలో అవెన్యూ ప్లాంటేషన్ క్రింద 172 కిమీ మేర మొక్కలు నాటడం లక్ష్యం కాగా 83 కిమీ మేర మొక్కలు నాటడం జరిగిందని అధికారులు చీఫ్ విప్ కు వివరించారు.1 లక్ష మొక్కలను నాటడం లక్ష్యం కాగా ఇప్పటికి 50 వేల మొక్కలను నాటారని అధికారులు తెలపగా,నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని చీఫ్ విప్ ఆదేశించారు.ఉద్యాన వనం పథకం క్రింద 1796 ఎకరాల లక్ష్యం కాగా 1073 ఎకరాలకు మంజూరు అయిందన్నారు.1049 ఏకరాలలో గుంతలు తీయడం జరిగిందన్నారు.302.87 ఎకరాలలో మామిడి తదితర మొక్కలును త్వరలోనే నాటడం జరుగుతోందన్నారు.ఉపాధి హామీ వేతన చెల్లింపులు రూ 58.70 కోట్ల చెల్లింపులు జరిగాయన్నారు. రాయచోటి పట్టణ సమీపాన ఇనాయత్ ఖాన్ చెరువు సమీపాన,సంబేపల్లె మండలం నారాయణరెడ్డి గారిపల్లె సమీపాన ఉన్న తిరుమల రాయి గుట్టవద్ద, రామాపురం మండల కేంద్రంలో పార్క్ లును ఏర్పాటు చేయడం జరుగుతోందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.