రాయచోటి నియోజక వర్గ ప్రజలు ముఖ్యమంత్రి జగన్ కు రుణపడి ఉంటారు:  శిబ్యాల విజయభాస్కర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్

రాయచోటి నియోజక వర్గ ప్రజలు ముఖ్యమంత్రి జగన్ కు రుణపడి ఉంటారు:  శిబ్యాల విజయభాస్కర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్

ఆర్.బి.ఎం రాయచోటి: రాయచోటి జిల్లా కేంద్రం అయ్యేందుకు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు మిధున్ రెడ్డి,ప్రభుత్వ అదనపు కార్యదర్శి ధనంజయరెడ్డి ల కృషి ఎనలేనిది మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శిబ్యాల విజయభాస్కర్ అన్నారు.బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వెనుకబాటుతనంతో ఇబ్బందులు పడుతున్న రాయచోటి నియోజకవర్గ ప్రజల కల నెరవేరిందని,రాయచోటి ప్రాంత వాసులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటారని తెలిపారు.రాజంపేట పార్లమెంట్ పరిధిలో రాయచోటి నియోజక వర్గానికి అనుకూలంగా 32 మండలాలు ఉండగా కేవలం 9 మండలాలు మాత్రమే ఈ ప్రాంతానికి కొంత దూరంలో ఉన్నాయన్నారు. అంతేగాక రాజంపేట వెళ్లాలంటే రెండు ఘాట్ రోడ్లు సుమారు 20 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం ఉంటుందని చెప్పారు.

రాయచోటి జిల్లా కేంద్రం ఏర్పాటుకు జాతీయ రహదారులతో పాటు నీటి వసతి, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైనంత ప్రభుత్వ భూమి సమృద్ధిగా ఉందనే విషయాన్ని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు,నాయకులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా రాయచోటి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులతో పాటు స్వచ్ఛంద సంస్థలు,ప్రజాసంఘాలు,విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగిందన్నారు. దీనికి తోడు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి,రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ప్రభుత్వ అదనపు కార్యదర్శి రాయచోటి వాసి ధనంజయ రెడ్డి లు ఈ ప్రాంత విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించి వెనుకబడి ఉన్న రాయచోటి జిల్లా కేంద్రం చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.రాయచోటి జిల్లా కేంద్రం కావడానికి సహకరించిన నియోజకవర్గ ప్రజలకు,వైసీపీ నేతలకు,స్వచ్ఛంద సంస్థలు సభ్యులకు,ప్రజాసంఘాలు,విద్యార్థి సంఘాలు, ఉద్యోగులు అధికారులు ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బంది,కార్మికులు వ్యాపారులు ఇలా అందరికీ ఆయన పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published.