బిగ్‌బాస్ షోపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

అమరావతి: బిగ్‌బాస్‌ షోపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బిగ్‌బాస్ షో ను నిషేధించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈ రోజు న్యాయస్థానం విచారణ చేపట్టింది. పిటిషన్ తరపున న్యాయవాది ఐబీఎఫ్ గైడ్ లైన్స్ పాటించలేదని కోర్టుకు దృష్టికి తెచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం కూడా అశ్లీలతపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 1970 లలో సినిమాల విషయాన్ని ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రస్తావించింది. ప్రతివాదులకు నోటీసుల విషయాన్ని తదుపరి వాయిదాలో నిర్ణయిస్తామని కోర్టు పేర్కొంది. కేంద్రం తరఫు న్యాయవాది దీనిపై స్పందించేందుకు సమయం కోరారు. ఈ కేసు విచారణను అక్టోబరు 11కు హైకోర్టు వాయిదా వేసింది. బిగ్‌బాస్‌ షో పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షోను నిషేధించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బిగ్‌బాస్ షోలో అశ్లీలత ఎక్కువగా ఉంటోదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి షోల వల్ల సమాజానికి నష్టమే తప్ప లాభం లేదని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.