పారిశ్రామికంగా అన్నమయ్య జిల్లాకేంద్రం రాయచోటిని ఆభివృద్ది చేసుకుని నిరుద్యోగ యువతకు,రైతాంగానికి తోడుందాం…

పారిశ్రామికంగా అన్నమయ్య జిల్లాకేంద్రం రాయచోటిని ఆభివృద్ది చేసుకుని నిరుద్యోగ యువతకు,రైతాంగానికి తోడుందాం…

ఆర్.బి.ఎం: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిని పారిశ్రామికంగా ఆభివృద్దిచేసుకుని తద్వారా నిరుద్యోగ యువతకు, రైతాంగానికి తోడుందామని అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు, ఎంఎల్ఏ గడికోట శ్రీకాంత్ రెడ్డి పిలుపనిచ్చారు. మూడేళ్లనుంచి మన రాయచోటి పట్టణం, నియోజక వర్గం అనేక మార్పులతో ముందుకు వెళ్తున్నామన్నారు. అభివృద్ధి విషయములో కానీ, జాతీయ రహదారుల ఏర్పాటులో కానీ, దెబ్బతిన్న రహదారుల రెన్యువల్ విషయాలలోనూ,ఇంటింటికీ కుళాయి విషయాలలో జిల్లా కేంద్రం ఏర్పడిన తరువాత వస్తున్న మార్పులు మనందరి కల్లకు కనపడుతున్నాయన్నారు. రాబోవు సంవత్సరంలో మరింత అభివృద్ధితో జిల్లా కేంద్రం కళ్ళకు కనపడుతుందన్నారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగించుకుంటే , నూతనంగా పదివేల కుటుంభాలు పట్టణ పరిధిలో స్థిర నివాసం ఏర్పరచుకునే విధంగా తీర్చిదిద్దుకుంటే వివిధ వ్యాపారాలు సాధారణ స్థాయి కంటే మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. రాయచోటి నియోజక వర్గానికి చెందిన యువత గల్ఫ్ దేశాలతో పాటు అమెరికా, సింగపూర్, యూరప్, ఆస్ట్రేలియా తదితర దేశాలలో అనేకమంది స్థిరపడ్డారన్నారు. వీరితో పాటు హైదరాబాద్, పూణే, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ,ముంబై తదితర నగరాలలో కూడా మన ప్రాంత వాసులు వేల మంది ఉద్యోగ ఉపాధిని పొందుతున్నారన్నారు.

అందరం ఒక్కటై ,రాయచోటి ప్రాంత ఎదుగుదలే మన లక్ష్యంగా పెట్టుకుని, నిస్వార్థంతో,మంచి ఆలోచనలుతో యువతకు ఉపసయోగపడే విధంగా మనల్ని మనం మలుచుకుందామన్నారు. జిల్లా కలెక్టర్ తో కూడా చర్చించడం జరిగిందని మనకు రాయచోటిలో రెండు, మూడు వందల ఎకరాల భూమిని ఇండస్త్రీయల్ ఎస్టేట్ కు , ఏపి ఐ సి సి కి భూమిని గుర్తించి, ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకుంటే ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు, మంచి స్థాయిలో వున్న వాళ్ళు, పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్న వాళ్ళకు మనం అండగా ఉండి, ఒక చిన్న ఐ టి స్టార్టప్ కంపెనీ కానీ, వారి ఆలోచనల ప్రకారం ఉపయోగపడే పరిశ్రమలు ఏర్పాటు చేసే విదంగా
మనం దానికి సహాయం అందిద్దామన్నారు. అలాగే కరోన వంటి విపత్కర పరిస్థితులును చూసామని, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాం..ఇవన్నీ బేరీజు వేసుకుని స్థిరంగా వుండేటటువంటి మార్కెట్ వైపు కానీ ,ఐ టి వైపు కానీ, రైతులుకు ఉపయోగప పడేటటువంటి మార్కెట్ సౌకర్యాలుపైన దృష్టి పెట్టి ప్రతిభే ఆధారంగా మంచి ఆలోచనలను గౌరవించి వారికి తోడుగా ఉండి రాబోవు తరానికి మన నియోజక వర్గంకానీ మన ,ప్రాంతం కానీ ఉపయోగపడే విధంగా ప్రణాలికలును రూపొందించు కుందామన్నారు.

ఎవరైనా ముందుకు వస్తే ఎప్పుడైనా కూడా గ్రూపుల వారీగా మనం సమావేశాలు ఏర్పరచుకుని, ఇక్కడి వారికి ఉపయోగపడే విధంగా, వాళ్ళ ఆలోచనలుకనుగుణంగా ఇక్కడి యంత్రాంగం సహకరించే విధంగా తోడుందామన్నారు. ముందుగా అవినీతిని నిర్మూలిద్దామని ప్రతిభా వంతులకు సహాయ సహకారాలు అందిద్దామన్నారు. ఆసక్తి ఉన్నవారి ఆలోచనలను గౌరవించి టైం లైన్ లు ఫిక్స్ చేసి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

మీ ఆలోచనలకనుగుణంగా, మీకొచ్చే మంచితో పాటు ఇక్కడ పదిమందికి అవకాశాలను ఇచ్చిన వారమవుతారన్నారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, మనం కూడా దానికి తగ్గట్లుగా భవిష్యత్ పైన భరోసాతో ముందుకు కదులుదామన్నారు. ఒకప్పుడు చైనా, భారత్ ల జి డి పిలు సమానంగా వుండగ్గా, ఈ రోజు టూ టైర్ టౌన్ లు కానీ, సెకండ్ టైర్ ప్రాంతాలు కానీ చిన్న చిన్న నగరాలు కానీ మనం చైనాతో పోలిస్తే చాలా వెనుకబడ్డామన్నారు. మనం స్వాతంత్రం ఇప్పించిన బంగ్లాదేశ్ తో కూడా కూడా వెనుకబడిపోయే పరిస్థితులు వచ్చాయన్నారు. యువతకానీ, మేధావులు కానీ ప్రతిభఉన్న వారిని గుర్తించి వారికి తోడు వుండి మార్పులుతో ముందుకు సాగుదామన్నారు.

ఎంతసేపు ప్రభుత్వమే ఏదో చేస్తుందన్నఆలోచనల నుంచి యువత బయటకు రావాలన్నారు. ప్రభుత్వ పరిశ్రమలు చాలా వరకు మూతపడుతున్నా యన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సొంతంగా లేదా పరిశ్రమలు కానీ, కంపెనీలు వ్యాపారాలు కానీ, బాగా అభివృద్ధికి వస్తున్నాయి, ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంత వాసులుగా మాతృభూమి రుణం తీర్చుకుందామన్నారు.

బయట స్థిరనివాసం ఏర్పడ్డ వారు సొంత ప్రాంతంలో పరిశ్రమలు, కంపెనీలు నెలకొల్పేందుకు ముందుకు రావాలని శ్రీకాంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. ప్రస్తుత గ్లోబలైజేషన్ లో వినూత్న ఆలోచనలుతో మన భారతీయులు ఇతర దేశాలలో ఎంతో ఎత్తుకు ఎదుగు తున్నారని,మంచి మనసుపెట్టి ఒక మంచి ప్రొడక్ట్ ను తీసుకువస్తే మన ప్రాంత వాసుల జీవితాలలో అనుకోని విధంగా మలుపులు తిరుగుతాయన్నారు.నిరుద్యోగ యువతకు మేలుచేసే విధంగా, ప్రయోజకులును చేసే ఆలోచనలుతో ముందుకు సాగుదామని శ్రీకాంత్ రెడ్డి కోరారు.

Leave a Reply

Your email address will not be published.