దేశంలోనే రోల్‌మోడల్‌గా సీఎం వైయస్‌ జగన్‌ పాలన: ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి..

దేశంలోనే రోల్‌మోడల్‌గా సీఎం వైయస్‌ జగన్‌ పాలన: ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి..

ఆర్.బి.ఎం: గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని,  టీడీపీ దిగిపోయేనాటికి రూ.80 వేల కోట్ల బకాయిలు, దాదాపు రూ.3 లక్షలకోట్లకు పైగా అప్పులు చేసిందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి గుర్తుచేశారు. టీడీపీ గెజిట్‌ పేపర్‌ ఈనాడులో రాష్ట్ర ఖజానాలో రూ.100 కోట్లు కూడా లేవనే వార్త అందరం చూశామన్నారు. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైయస్‌ జగన్‌.. పాదయాత్రలో గమనించిన ప్రజల కష్టాలను తీర్చాలని, ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలని, పథకాలు స్వయంగా పేదల ఇంటికి చేరాలని దేశంలోనే రోల్‌ మోడల్‌గా సీఎం వైయస్‌ జగన్‌ తన పాలన కొనసాగిస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *