గవర్నర్ పై దాడి అంటే ఒక వ్యవస్థ పై దాడే: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి..

గవర్నర్ పై దాడి అంటే ఒక వ్యవస్థ పై దాడే: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి..

ఆర్.బి.ఎం అమరావతి: గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ హ‌రిచంద‌న్‌పై టీడీపీ నేత‌లు దాడి చేయ‌బోయార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గవర్నర్ పై దాడి అంటే ఒక వ్యవస్థ పై దాడిగా అభివ‌ర్ణించారు. బడ్జెట్‌ సమావేశాల్లో ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించిన గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్ ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో సభలో టీడీపీ వ్యవహరించిన తీరు బాధాక‌ర‌మ‌న్నారు. గవర్నర్‌ను అగౌరవపర్చేలా టీడీపీ వ్యవహరించింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఏపీ శాసనసభ ప్రాంగణం మీడియా పాయింట్‌ నుంచి మాట్లాడారు.

ఇదిసమంజసమా
చంద్రబాబుగారు తమ పార్టీ సభ్యులకు శిక్షణనిచ్చి పంపించారు. అందుకే వారు రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి అని కూడా గవర్నర్‌గారిని గౌరవించకుండా, అసలు ఆయన ప్రసంగంలో ఏముందో కూడా చూడకుండా, ఆ ప్రసంగ ప్రతులను ఆయన కళ్ల ముందే చించేసి, నినాదాలు చేస్తూ ముందుకు దూసుకుపోయి ఆయనపైనే దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇది సమంజసమా? నిజానికి మీరు వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. అయినా మీకు పదే పదే వ్యవస్థల గురించి మాట్లాడతారు. అయితే ఇవాళ మీరు వ్యవహరించిన తీరు ఎంత సంస్కారహీనమో, ఎంత సమంజసమో ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి.

Leave a Reply

Your email address will not be published.