త్యాగానికి ప్రతీక మోహరం…

త్యాగానికి ప్రతీక మోహరం…

ఆర్.బి.ఎం: త్యాగానికి,మత సాకరస్యానికి ప్రతీకగా మోహరం నిలుస్తుందని వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మోహర్రం సందర్భంగా సోమవారం చిన్నమండెం కస్పాలో జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డితో కలసి శ్రీకాంత్ రెడ్డి గంధపు పీర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువులు శ్రీకాంత్ రెడ్డి, దేవనాధ రెడ్డి లను ఆశీర్వదించి సత్కరించి ప్రసాదాలు అందచేశారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ధర్మ పరిరక్షణ, శాంతియుత సమాజ స్థాపన కోసం మ్మహమ్మద్ ప్రవక్త మనువడు హజ్రత్ ఇమామ్ హుసేన్ చేసిన ప్రాణ త్యాగం మానవాళికి దివ్య సందేశాన్ని అందిస్తోందన్నారు.సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన ఇమామ్ జీవితం వర్తమాన సమాజానికి ఆదర్శప్రాయమన్నారు.

Leave a Reply

Your email address will not be published.