సాకారమైన.. శ్రీకాంత్ రెడ్డి కల

సాకారమైన.. శ్రీకాంత్ రెడ్డి కల

ఆర్.బి.ఎం: జిల్లా సాధన, జిల్లా కేంద్రంలో తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కన్న కలలు. నేడు ఆ కలలు సాకారమయ్యాయి. జిల్లా సాధన ఏర్పాటుకు విశేషంగా కృషి చేసి అందరి సహకారంతో జిల్లాను సాధించారు. జిల్లా కేంద్రం రాయచోటి నేడు జిల్లా స్థాయి 75 వ స్వాతంత్ర్య సంబరాలకు వేదిక అయింది.జిల్లా కలెక్టరేట్, ఎస్ పి కార్యాలయంతో పాటు 95 కు పైగా జిల్లా ప్రధాన కార్యాలయాలు రాయచోటిలో ఏర్పాటయ్యాయి. జిల్లా కేంద్రంఏర్పడిన తరువాత కేవలం నాలుగు మాసాలలోనే పోలీసు పరేడ్ గ్రౌండ్ ను అందంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఈ పోలీసు పరేడ్ గ్రౌండ్ జిల్లా 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వేదిక అయింది.ఇంచార్జి మంత్రి,ఎంఎల్ఏలు, జిల్లా కలెక్టర్, ఎస్ పి తదితర ఉన్నతాధికారులుచే తొలిగా జెండా ఎగురవేయనుండడం జరగనుంది. వివిధ శాఖల శకటాల ప్రదర్శన,వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు రంగ రంగ వైభవంగా నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published.