ఒకే ప్రాంగణంలోనే బాల బాలికలకువిద్యనందించే సంకల్పం నెరవేరుతోంది..

ఒకే ప్రాంగణంలోనే బాల బాలికలకువిద్యనందించే సంకల్పం నెరవేరుతోంది..

ఆర్.బి.ఎం: జిల్లా కేంద్రమైన రాయచోటిలో ఒకేప్రాంగణంనందు బాలబాలికలకు మూడవ తరగతి నుంచి డిగ్రీ వరకు అధునాతన వసతులు, సాంకేతికతతో కూడిన విద్యను అందించే సంకల్పం నెరవేరబోతోందని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలలో డిగ్రీ విద్యార్థులుకు తరగతి గదులు సరిపోకపోవడం నేపథ్యంలో శనివారం శ్రీకాంత్ రెడ్డి తరగతి గదులకోసం కళాశాల ప్రిన్సిపాల్, సిరికల్చర్ అధికారులుతో కలసి సిరికల్చర్ కార్యాలయ ప్రాంగణంలో ఖాళీగా ఉన్న గదులను, స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రూ 14.50 కోట్ల నిధులుతో మాహిళా డిగ్రీ కళాశాల భవన నిర్మాణాపు పనులు ప్రారంభం కానున్నాయన్నారు. అంతవరకు తాత్కాలికంగా విద్యార్థులుకు తరగతి గదులను , ల్యాబ్ ను నిర్వహించు కోవడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతోందన్నారు. తాత్కాలికంగా పది తరగతి గదులకు మౌళికవసతుల కల్పనకు ఎస్టిమేషన్లును రూపొందించేందుకు సంబంధిత శాఖాధికారులు చర్యలు చేపట్టారన్నారు. కళాశాల ప్రక్కనే పోలీసు స్టేషన్ ఉండడం వల్ల బాల బాలికలుకు భద్రత ఉంటుందన్నారు. ప్రతి బాలిక ముఖ్యంగా మైనారిటీ బాలికలు డిగ్రీ వరకు ఎక్కడా చదువులును ఆపకుండా కొనసాగించి ఉన్నత చదువులకు వెళ్లాలన్నదే తమ లక్ష్యమన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, సెరికల్చర్ జె డి రాజశేఖర్ రెడ్డి, ప్రిన్సిపాల్ హైదర్ అలీ, లెక్షరర్ సూర్యనారాయణరెడ్డి, కౌన్సిలర్లు సాదక్ అలీ, పల్లా రమేష్ , భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.