ఏపీ ప్రజలు తెలివైన వారు: మోదీ

విశాఖ: విశాఖ పర్యటనను ప్రధాని మోదీ.. ఏపీ ప్రజలను పొగడ్తలతో ముంచెత్తి ముగించారు. విభజన హామీల్లో ఏ ఒక్క హామీని కూడా ప్రధాని ప్రస్తావించలేదు. విశాఖ పర్యటనలో ఏపీకి ప్రధాని శుభవార్తతో వస్తారని అందరూ అనుకున్నారు. కొత్త ప్రాజెక్టుల ఊసే ఎత్తలేదు. విశాఖలో మోదీ నలబై నిమిషాలు మాట్లాడారు. ఈ సమయమంతా విశాఖను తర్వాత ఏపీ ప్రజలను ప్రశంసించడానికే కేటాయించారు. మిగిలిన సమయాన్ని బీజేపీ నేతలను అభినందించారు. ఈ సభకు వ్యయప్రయాసలు కూర్చి ఏపీ ప్రభుత్వం జనాలను సమీకరించింది. ఇంత కష్టపడిన వైసీపీ నేతలకు కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. సార్ మీరు సానుకూలంగా స్పందించాలంటూ సీఎం జగన్న విజ్ఞప్తి చేసిన మోదీ పెడచెవిన పెట్టడం గమనార్హం.

దేశంలో విశాఖ ప్రత్యేకమైన నగరమని కొనియాడారు. ఏపీ ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతున్నారని కొనియాడారు. ఇక్కడి ప్రజల తెలివితేటలు, టెక్నాలజీ మాత్రమే కారణం కాదని, వారి స్నేహ శీలత, మంచితనం కూడా ఓ కారణమని ప్రశంసించారు. అంతరిక్షం నుంచి సముద్ర గర్భం వరకు ప్రతి రంగంలోనూ ఎంతో ప్రగతి సాధిస్తున్నామని పేర్కొన్నారు. అన్నదాతలకు ప్రతి ఏడాది మూడు విడతలుగా రూ.6 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నామని గుర్తుచేశారు. పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారికి అండగా నిలుస్తుందని మోదీ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.