పురుషుల్లో నరాల బలహీనతకు దివ్యౌషదం సీతాఫలం

శీతాకాలం పండుగా పరిగణించే సీతాఫలం పోషకాల సమాహారం. కొన్ని రకాల అనారోగ్యాలు నివారణి. మరెన్నో సుగుణాలున్న ఈ పండు గురించి వివరింగా తెలుసుకుందాం. ఈ కాలంలో మూడు నెలలకు పైగా లభిస్తుంది సీతాఫలం. ఈ పండు రామాఫలం, లక్ష్మణఫలం రకాల్లోనూ దొరుకుతుంది. చూడడానికి ఒకే విధంగా ఉన్నా.. రుచి, వాసనలో కాస్త తేడా ఉంటుంది. సీజన్‌ వస్తోందంటే చాలు… కొన్ని పండ్ల రుచి పదే పదే గుర్తొచ్చేస్తుంటుంది. మార్కెట్లో అవి ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అన్నట్లు ఎదురుచూసేలా చేస్తుంది. ఆ కోవకే చెందుతాయి సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలాలు. ఈపేర్లు చూస్తే మన పురాణ పురుషులకు ఇష్టమైన పండ్లేవో అనిపించకమానదు. అంతేకాదు, ఇవి అచ్చంగా మనకి మాత్రమే ప్రత్యేకమైన పండ్లేనేవో అనిపిస్తుంది. మనరాష్ట్రంలో ఎక్కువగా పండే సీతాఫలాలతోనే మనకి అనుబంధం ఎక్కువ. కానీ ఉత్తరాంధ్ర, కొన్ని తెలంగాణా జిల్లాల్లోనూ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనూ రామాఫలాలు, లక్ష్మణఫలాలు ఎక్కువగా పండుతాయి. సీతాఫలం అమృతఫలాన్ని తలపించే సీతాఫలాన్నే కస్టర్డ్‌ యాపిల్‌ అనీ షుగర్‌ యాపిల్‌ అనీ పిలుస్తారు.

సీతాఫలంలో ప్రొటీన్లు, విటమిన్లు శరీరానికి ఎంతో ఉపకరిస్తాయి. సీతాఫలం పురుషుల్లో నరాల బలహీనత, కండరాల వృద్ధిని పెంచే గుణాలు అధికంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ బి6, సిలతోపాటు మెగ్నిషియం, కాపర్, పొటాషియం, ఫైబర్, ఐరన్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఉదయాన్నే ఒక సీతాఫలం తింటే శరీరాన్ని శక్తివంతంగా మారుస్తుంది. సన్నగా ఉన్న వారు సీతాఫలం తినడం వల్ల దృఢంగా మారుతారు. గర్భిణులు సీతాఫలం తింటే సుఖప్రసవం అవుతుంది. తల్లితో పాటు కడుపులో ఉండే బిడ్డకు కూడా రోగ నిరోధక శక్తి పెంచుతుంది. బిడ్డ మెదడు, నాడీ వ్యవస్థ మెరుగవుతుంది. పాల ఉత్పత్తిని పెంచడంలో సీతాఫలం అమోఘంగా సాయపడుతుంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకంతో బాధపడే వారికి సీతాఫలం దివ్య ఔషధం. అల్సర్, గ్యాస్, ఎసిడిటి వంటి ఉదర సమస్యలను దూరం చేస్తుంది. కీళ్ల నొప్పులకు పరిష్కారం చూపుతుంది.

Leave a Reply

Your email address will not be published.