అనంతపురం గంగమ్మ తల్లిఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.. చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

అనంతపురం గంగమ్మ తల్లిఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.. చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

ఆర్.బి.ఎం: అనంతపురం గంగమ్మ దేవత ఆలయ అభివృద్ధికి మరింత కృషిచేస్తామని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శనివారం లక్కిరెడ్డిపల్లె మండలం అనంతపురం గ్రామంలోని శ్రీశ్రీశ్రీ గంగమ్మ తల్లి నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి మాజీ ఎంఎల్ఏ మోహన్ రెడ్డి, ఎంపిపి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, జెడ్ పి టిసి రమాదేవి, సర్పంచ్ వెంకట నారాయణరెడ్డిలతో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కోరిన కోర్కెలు నెరవేర్చుతూ భక్తులకొంగు బంగారంగా అనంతపురం గంగమ్మ తల్లి విరాజిల్లుతోందన్నారు.

దినదినాభివృద్ది చెందుతున్న ఈ ఆలయాన్ని రాయలసీమ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందేలా కృషి చేస్తామన్నారు. ఆలయం చుట్టూ సిమెంట్ రహదారుల సౌకర్యం ,కోనేరు ఏర్పాటు తో పాటు, మరిన్ని వసతుల కల్పనకు కృషిచేస్తామన్నారు. నూతన ధర్మకర్తల మండలి ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేసి ఆదర్శంగా నిలవాలన్నారు.ధర్మకర్తల మండలి, ఆలయ అధికారులు, సిబ్బంది , దాతల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు.

ప్రతి భక్తుడికి అమ్మవారి దర్శనం సులభంగా లభించేలా ధర్మకర్తలి మండలి కృషిచేయాలన్నారు.ఆలయ సంస్కృతి, సాంప్రదాయాలను , ఆస్తులను పరిరక్షించి భావితరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు.భక్తులకు సౌకర్యాల కల్పనలో ధర్మకర్తలి మండలి తనదైన ముద్ర చూపించాలని ఆయన సూచించారు.భక్తుల పాలిట కల్పవల్లిగా అనంతపురం గంగమ్మ తల్లి విరాజిల్లుతోందన్నారు.

నియోజక వర్గ పరిధిలోని వీరభద్ర స్వామి ఆలయం, చిన్నమండెం మండెం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం,కొత్తపల్లె కోదండ రామాలయం, సంబేపల్లె గ్రామంలోని శ్రీ దేవర రాయి నల్లగంగమ్మ తల్లి ,గుహేశ్వరి పసుపతినాధ ఆలయం తదితర ఆలయాల అభివృద్దికి శ్రీకారం చుట్టామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. అధిక వర్షాలుతో దెబ్బతిన్న పంటలకు నియోజక వర్గ పరిధిలోని రైతులకు రూ 13 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ అందిందన్నారు.

Leave a Reply

Your email address will not be published.