జామియా మసీదులో మైనారిటీ సోదరులుతో కలసి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

జామియా మసీదులో మైనారిటీ సోదరులుతో కలసి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

ఆర్.బి.ఎం: రాయచోటి పట్టణంలోని ఠాణా వద్ద ఉన్న జామియా మసీదులో శుక్రవారం జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో మైనారిటీ సోదరులుతో కలసి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి అయినందున , ఈ ప్రాంతం భగవంతుణి దీవెనెలతో దిన దినాభివృద్ది చెందాలని, ప్రజలందరూ అభివృద్ధి బాటలో నడవాలని సర్కార్ జీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జిల్లా కేంద్రం ఏర్పాటుకు కృషిచేసిన సీఎం జగన్, చీఫ్ విప్ శ్రీకాంత్, ఎంపి మిథున్ లకు పెద్దఎత్తున వచ్చిన మైనారిటీ సోదరులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ,వైస్ చైర్మన్ లు ఫయాజ్ బాష, ఫయాజుర్ రెహమాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ చెన్నూరు అన్వర్ బాష, వైఎస్ఆర్ సిపి నాయకులు హాబీబుల్లా ఖాన్, బేపారి మహమ్మద్ ఖాన్, ఫయాజ్ అహమ్మద్, ఆసీఫ్ అలీఖాన్, కొలిమి ఛాన్ బాష, జిన్నా షరీఫ్, ఎస్ పి ఎస్ రిజ్వాన్,జిల్లా సాధన సమితి ఇర్షాద్, మూసా,సాదిక్ అలీ, గౌస్ ఖాన్,అన్నా సలీం, రియాజ్,రౌనక్, రియాజుర్ రెహమాన్, ఇర్ఫాన్,జాఫర్ అలీఖాన్, కామ్రేడ్,నవరంగ్ నిస్సార్, తబ్రెజ్, కొత్తపల్లె ఇంతియాజ్,కో ఆప్షన్ ఖాదర్ వలీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *