రంజాన్ లోగా ఈద్గా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి…
ఆర్.బి.ఎం: రంజాన్ లోగా ఈద్గా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులును చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆదేశించారు. సోమవారం చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పాత రాయచోటి లోని ఈద్గా ను సందర్శించారు. అధిక వర్షాలుతో దెబ్బతిన్న కల్వర్టును రూ 15 లక్షల నిధులుతో త్వరితగతిన నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈద్గా ప్రహరీకి రంగులు వేయడంతో పాటు పెండింగ్ వర్కులును రూ 18 లక్షల అంచనా వ్యయంతో నిర్మించాలని సూచించారు. కరోనా కారణంగా రెండేళ్ల నుంచి ఈద్గా లో ప్రార్థనలు జరగలేదని, ఈ సారి రంజాన్ కు పెద్దఎత్తున ముస్లిం సోదరులు తరలివచ్చి ప్రార్థనలు చేసే అవకాశం ఉన్నందున ఈద్గా లో అన్ని వసతులను కల్పిస్తామన్నారు.ఈద్గా కు పట్టణ నలువైపుల నుంచి వచ్చే రహదారుల మరమ్మత్తులు కూడా చేపట్టాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు. ఈద్గా అభివృద్ధి పనులుపై స్థానిక నాయకులు,మున్సిపల్ డీఈ, ఏ ఈ లు సుధాకర్ నాయక్, కృష్ణారెడ్డి లతో శ్రీకాంత్ రెడ్డి చర్చించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు ఫయాజ్ బాష, ఫయాజుర్ రెహమాన్, హాబీబుల్లా ఖాన్, అలీ నవాజ్ ఖాన్,ఆసీఫ్ అలీ ఖాన్,బేపారి మహమ్మద్ ఖాన్,మదన మోహన్ రెడ్డి, ఫయాజ్ అహమ్మద్, సుగవాసి ఈశ్వర్ ప్రసాద్,గౌస్ ఖాన్, గువ్వల బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.
