చిన్నారి కుటుంబానికి 10 కోట్లు ఇవ్వాలని వైఎస్ షర్మిల సైదాబాద్ లో దీక్ష..

ys sharmila

చిన్నారి కుటుంబానికి 10 కోట్లు ఇవ్వాలని వైఎస్ షర్మిల సైదాబాద్ లో దీక్ష..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: సింగరేణి కాలనీలో అత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబ సభ్యులను వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పరామర్శించారు. చిన్నారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల పరిహారం ప్రకటించాలని షర్మిల డిమాండ్ చేశారు. చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు షర్మిల దీక్ష చేస్తాని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు జరగడానికి పోలీసుల వైఫల్యమే కాదా అని షర్మిల ప్రశ్నించారు. పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత లేదా అని షర్మిల అన్నారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని ఎన్కౌంటర్ చేస్తారో లేదా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ పెడ్తారో మీ ఇష్టం కానీ మళ్ళి మహిళలపై,చిన్నారులపై చేయి వేయాలంటే తల తెగుతుందనే భయం కల్పించాలని వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *