కరోనా థర్డ్ వేవ్ ను ఆహ్వానించేందుకు తీవ్రంగా కష్టపడుతున్న రాజకీయ నాయకులు..

కరోనా థర్డ్ వేవ్ ను ఆహ్వానించేందుకు తీవ్రంగా కష్టపడుతున్న రాజకీయ నాయకులు..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: కంటికి కనిపించని శత్రువుతో మానవాళి పోరాటం చేస్తోంది. కారోన మహమ్మరిని పూర్తిగా అంతమొందించేందుకు శాస్త్రవేత్తలు ఎంతగానో శ్రమిస్తున్నారు. కరోనా దాటికి ఎన్నో దేశాలలో విలవిలలాడుతున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్,సెకండ్ వేవ్ అంటూ మనుషులపై పంజా విసురుతూ కరోనా మహమ్మారి బలి తీసుకుంటుంది.

ప్రస్తుతం కరోనా మహమ్మరి నుండి తప్పించుకోవడానికి ఏకకైక మార్గం ఎవరికి వారు తగిన జాగ్రత్తలు పాటించడమే. వాక్సిన్ వేయించుకున్న అనంతరం కూడా చాలా మందికి కరోనా సోకుతోంది. వాక్సిన్ వేసుకున్నాం అనే ధైర్యంతో ప్రజలు కరోనా పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోకుండా అజాగ్రత్తగా వ్యవహరించడమే వల్లే కారోన మళ్ళీ సోకుతోంది.

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునట్టు ప్రస్తుతం సమాజం తీరు ఉంది అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో మాత్రమే ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తున్నారు. కారోన అధికంగా వ్యాప్తి చెందేందుకు కారణం ఏంటో అనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలిసిన అవసర ఎంతైనా ఉంది.

కారోన ఫస్ట్ వేవ్,సెకండ్ వేవ్ లో మనుషులు ఎం కోల్పోయారో ఎంత నష్టపోయారు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. మళ్ళీ అలాంటి నష్టాలు జరగకుండా ఎవరు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

కరోనా మహమ్మరి అనే వైరస్ ఒకరి నుండి మరొక్కరికి సోకుతుంది కాబట్టి సామాజిక దూరం కచ్చితంగా పాటించాలి, ముస్కులు ధరించాలి, అవసరం ఉంటే తప్ప బహిరంగంగా ప్రదేశాల్లో ఉండకూడదు ఇలా కొన్ని నిబంధనలను పాటిస్తే మంచిది. కానీ ప్రజలు ఇవేవీ పట్టించుకోకుండా విచ్చలవిడిగా నిబంధనలను కలరాస్తూ ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నారు.

ఇదిలా ఉండగా ప్రజలకు కరోనా వ్యాప్తి పట్ల అవగాహన కల్పించాల్సిన నాయకులు. కానీ వారే స్వయంగా కరోనా మహమ్మరిని కి ఆహ్వానం పలికేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. బహిరంగ సభల పేరుతో వేలాదిమంది ప్రజలతో సభలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ను అదే పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణ లో అయితే రాజకీయ నాయకుల పాదయాత్రలు జోరుగా సాగుతున్నాయి. ఇవి చాలు కరోనా థర్డ్ వేవ్ కు స్వాగతం పలికేందుకు.

రాజకీయ నాయకులు బహిరంగ సభలు నిర్వహించకూడదు, పాదయాత్రలు చేయకూడదనేది మా ఉద్దేశం కాదు ఈ విపత్కర పరిస్థితుల్లో అలా చేయకపోవడం ప్రజలకు,నాయకులకు అందరికి శ్రేయస్కరం అని మా ఉద్దేశం.. ఆర్.బి.ఎం డెస్క్

Leave a Reply

Your email address will not be published.