చంద్రబాబు అడ్డగాడిద అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని..

చంద్రబాబు అడ్డగాడిద అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని..

ఆర్.బి.ఎం డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనకు నేటితో రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో వైసిపి ప్రభుత్వంపై మంత్రి కొడాలి నాని ప్రశంసల వర్షం కురిపించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అయన అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని వారి అభివృద్ధి కోసం నిరంతరం అలుపేరుగా కుండా కష్టపడుతన్న సీఎం అని నాని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి పేదల కోసం ఈ రెండేళ్లలో అనేక సంక్షేమ పధకాలు ప్రవేశ పెట్టారని ఏ ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు లేవని ఈ సందర్బంగా మంత్రి నాని అన్నారు.

2014 లో చంద్రబాబుకు అధికారం ఇచ్చి తప్పు చేశామని ఆంధ్ర ప్రజలు బాధపడుతున్నారని నాని అన్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు చేసింది ఏమి లేదని అయన అన్నారు. 2014 జగన్ మోహన్ రెడ్డి కి అధికారం ఇచ్చి ఉంటె ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధిలో నడిచేది అని ప్రజలు ఆలోచించుకుంటున్నారని నాని తెలిపారు. ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి పాలనకు అందరు జై కొడుతున్నారని అన్నారు.

చంద్రబాబు కు ఎన్నికలు వస్తే తప్ప ప్రజలు కనబడరని నాని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నిలకలో ఓటర్లను మభ్య పెట్టడానికి ఎన్నో హామీలు ఇచ్చారని అన్నారు. ప్రజలు ఒక్కసారి చంద్రబాబు ని నమ్మి అధికారం ఇచ్చినందుకు ఎంతో బాధ పడ్డారని అన్నారు. చంద్ర బాబు అధికారంలో కి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని నాని అన్నారు. ప్రజలను చంద్రబాబు మోసం చేసినట్టు ఏ రాజకీయ నాయకుడా చేయలేదని అయన వ్యాఖ్యానించారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ బైబిల్,కురాన్.భగవద్గీతలు గా భావించి ప్రతి హామీని నెరవేరుస్తూ వస్తున్నారని కొడాలి నాని అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేసిన దాన్ని చెడుగా ప్రచారం చేసే పనిలో చంద్రబాబు నాయుడు టీం ఉందని అయన అన్నారు. చంద్రబాబు ఎట్లాగో ప్రజలు సేవ చేయడు చేసే వారిని చేయనివాడు అని నాని అన్నారు. చంద్రబాబు ప్రతి పక్షంలో ఉండి ప్రజల తరుపున పోరాడాల్సింది మరిచిపోయి కేవలం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాని ద్వేషించడమే పనిగా చంద్రబాబు వ్యవహరిస్తునారని మంత్రి కొడాలి నాని అన్నారు.

చంద్రబాబు నాయుడుకు తెలిసింది ఒక్కటే నమ్మినవారిని వెన్నుపోటు పొడవడం అని నాని అన్నారు. వెన్నుపోటుకు మారు పేరు చంద్రబాబు నాయుడు అని అన్నారు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నట కిరీటి తెలుగు తేజం మహానుబావుడు నందమూరి తారకరామారావు గారికి NDA ప్రభుత్వం భారత రత్న ఇస్తామని ముందుకు వస్తే దాన్ని అడ్డుకున్న అడ్డగాడిద నారా చంద్రబాబు నాయుడు అని మంత్రి కొడాలి నాని తనదైన శాలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇకనైనా చంద్రబాబు ద్వేషాలను వదిలి ప్రజల కోసం ఆలోచించాలని నాని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *