చిన్నారిని హింసించిన శాడిస్టును కఠినంగా శిక్షించాలి.. సీతక్క ఫైర్

చిన్నారిని హింసించిన శాడిస్టును కఠినంగా శిక్షించాలి.. సీతక్క ఫైర్

హైదరాబాద్: ఎమ్మెల్యే సీతక్క ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రత్యక్షమవుతారు. అది కారడవి కావచ్చు మెట్రో నగరం కావచ్చు సమస్య ఉంటే ఇట్టే వాలిపోతారు. మరీ ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై ఆకృత్యాలు జరిగితే ఆమె చలించిపోతారు. ఇటీవల మెదక్‌కు చెందిన నాగరాజు అనే వ్యక్తి తన మూడేళ్ల కూతురి దారుణంగా హింసించాడు. ఎందుకంటే నాగారాజు రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కుమార్తె(3)ను తరచూ హింసించేవాడు. ఇటీవల తన రెండో భార్య కళ్ల ముందే కుమార్తెను హింసించడం స్థానికులు సెల్‌లో చిత్రీకరించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో సీతక్క కంట్లో పడింది. ఈ వీడియో చూసిన సీతక్క చలించిపోయారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు రక్తం మరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులకు కఠిన శిక్షలు పడితే… ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పారు. శాడిస్టు నాగరాజును వెంటనే కఠినంగా శిక్షించాలని సీతక్క డిమాండ్ చేశారు. ఈ వీడియోను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని నెటిజన్లు కాంమెట్లు పెడుతున్నారు. రెండో భార్య మోజులో పడి సొంత కుమార్తెను హింసించడం దారుణమని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు. సీఎం కేసీఆర్ స్వంత జిల్లాలో ఈ ఘటన జరిగిందని కేసీఆర్, హరీష్‌రావు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.