మునుగోడులో టీఆర్‌ఎస్, బీజేపీకి చుక్కలు చూపిస్తున్న ఓటర్లు

మునుగోడు: మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు రసవత్తరంగా ఉన్నాయి. ఓటర్లు ఏ పార్టీకి మెజార్టీ ఇవ్వలేదు. బోటాబోటి మెజార్టీతో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కొనసాగుతున్నారు. ఈ ఫలితాలు టీఆర్‌ఎస్, బీజేపీ నేతలను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతుంది. వేల రూపాయలు తీసుకున్న ఓటర్లు సమాన దృష్టితో ఓట్లు వేశారు. అందుకే టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పెద్ద మెజార్టీ కాలేదు. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కించారు. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 686 నమోదయ్యాయి. టీఆర్‌ఎస్‌ 228, బీజేపీ 224, బీఎస్పీ 10, ఇతరులు 88 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్లతో కేవలం నాలుగు ఓట్లు మాత్రమే టీఆర్‌ఎస్‌కు మెజార్టీ వచ్చింది. పోస్టల్ బ్యాలెట్‌ మొదులుకొని ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. మునుగోడులో టీఆర్‌ఎస్, బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. 4 రౌండ్లు ముగిసేసరికి టీఆర్‌ఎస్‌ 26,346, బీజేపీ 25730, కాంగ్రెస్‌ 8200, బీఎస్పీ 907 ఓట్లు వచ్చాయి. మునుగోడులో రోటీమేకర్, రోడ్‌రోలర్ గుర్తులు చుక్కలు చూపిస్తున్నాయి. రోటీమేకర్‌కు 104 ఓట్లు, రోడ్‌రోలర్‌కు 84 ఓట్లు పొలయ్యాయి. టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీ అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీతో మాత్రమే గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితమయ్యే పరిస్థితి ఉంది.

Leave a Reply

Your email address will not be published.