శృంగారంలో సత్తా చాటలేకపోతున్నారా… ఇక మీరు అధైర్య పడాల్సిన అవసరం లేదు..!

దాంపత్య జీవితంలో సాఫిగా సాగాలంటే ఆర్థిక పరిపుష్టిలో పాటు శృంగారం కూడా ప్రధానమైనది. భార్యభర్తల మధ్య ఉండే బంధాల్లో శృంగారానిదే ప్రధాన భూమిక. ఆలుమగల మధ్య శృంగారంతోనే అవినాభావ సంబంధం బలంగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా దృఢత్వం శృంగారంతోనే సాధ్యమవుతుంది. వారంలో రెండుసార్లు శృంగారంలో పాల్గొంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో శృంగారంలో పాల్గొంటే ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయని అనేక అధ్యయానాలు చెబుతున్నాయి. అయితే మానసిక ప్రశాంత కొరవడినప్పుడు శృంగారం పట్ల ఆసక్తి తగ్గుతుంది. లైంగిక సమస్యలతో బాధపడుతుంటే భాగస్వామిపై కూడా ప్రభావం పడుతుంది. ఒత్తిడి వల్ల మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు వంటి రోగాలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. జీవితంలో ప్రశాంతత కోల్పొతే డిప్రెషన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇలా శృంగారాన్ని నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సిందే.

దాంపత్య జీవితంలో శీఘ్ర స్కలనం ఓ సమస్యగా గుర్తించారు. శృంగారంలో పాల్గొన్నప్పుడు త్వరగా స్కలనం అయ్యే పరిస్థితిని శీఘ్ర స్కలనం అంటారు. ఈ సమస్య ఉంటే జీవిత భాగస్వామి ఇబ్బందులకు గురవుతుంది. దీన్ని నుంచి బయట పడేందుకు ప్రాక్టీసు చేస్తే ఫలితం కనబడుతుంది. అలాగే చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో అంగస్తంభన సమస్య ఒకటి. అంగానికి రక్తప్రసరణ కాకపోతే స్పందిన ఉండదు. దీని వల్ల అంగం గట్టిపడదు. అంగం గట్టిగా కాకపోతే శృంగారంలో పాల్గొనే శక్తిని కోల్పోతారు. దీనికి ప్రధాన కారణం మానసికంగా ఎదురయ్యే ఇబ్బందులే. అలాగే డయాబెటిస్, బీపీ, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి లైంగిక సామర్థ్యం తగ్గుతుంది. ఈ వ్యాధులతో బాధపడుతున్న వారు శృంగారంలో తరుచు పాల్గొనలేరు. ఈ మూడు వ్యాధులతో బాధపడుతున్నవారు లైంగిక సమస్యలను అధిగమించాలంటే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటే సరిపోతుంది.

కొందరిలో పురుషాంగం వంకరగా ఉంటుంది. పురుషాంగం వంకరగా ఉంటే దాన్ని పెరోని వ్యాధి అంటారు. అంగం స్తంభించినప్పుడు వంకరగా ఉంటే శృంగారంలో పాల్గొనలేరు. అంగం వంకరగా ఉండటానికి అంగం పై భాగంలో గడ్డ ఉంటుంది. దీనివల్ల శృంగారంలో పాల్గొనలేరు. పెరోని వ్యాధి వల్ల గడ్డలను మందులతో కరిగించకోవచ్చు. ఆ తర్వాత శృంగార సమస్యలను అధిగమించి జీవిత భాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని గడపొచ్చు. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఉండేందుకు శృంగారమే పరిష్కారం. ఆలుమగలు శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Leave a Reply

Your email address will not be published.