చలికాలంలో నారింజపండు తిన్నండి.. ఆ రోగాలకు చెక్ పెట్టండి…!

శీతాకాలంలో మార్కెట్‌లో విరివిగా దొరికే పండ్లలో నారింజ పండు (సంత్రా) ఒకటి. ఈ పండులో అధికంగా సిట్రస్‌ ఉంటుంది. దీన్ని చలికాలం తినటం ఉత్తమం. ముఖ్యంగా నారింజ పండు తినటం లేదా జ్యూస్‌ రూపంలో తీసుకోవటం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. నారింజ పండు కఫం, వాతం, అజీర్ణాలను హరిస్తుంది. శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. మూత్ర విసర్జన ప్రక్రియను సరళతరం చేస్తుంది. నారింజలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి గంధకం, క్లోరిన్‌లు కూడా ఉన్నాయి. జ్వరాల బారిన పడి జీర్ణశక్తి తగ్గినప్పుడు… నారింజను వాడితే అజీర్ణ సమస్యల నుండి బయటపడవచ్చు. అలాగే, ఆహారనాళాలలో విషక్రిములు చేరకుండా నిరోధించే శక్తి కూడా నారింజకు ఉంది. నారింజలో బెటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలోని కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండులో ఉండే కాల్షియం.. ఎముకలు, దంతాల దృఢత్వానికి ఎంతగానో సహకరిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయటంలోనూ, రక్త ప్రసరణ సక్రమంగా జరగడంలోనూ దోహదపడుతుంది. ఫలితంగా గుండె పనితీరు మెరుగుపడుతుంది. విటమిన్ సి శాతం ఎక్కువగా ఉన్న నారింజను రోజుకు ఒకటి తీసుకున్నట్లయితే.. చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది.

జలుబు, దగ్గు లాంటి ఆరోగ్య సమస్యలు కూడా దరి చేరవు. రోజూ పరగడుపున ఒక గ్లాస్ నారింజ జ్యూస్ తాగితే, మార్నింగ్ సిక్‌నెస్‌ నుండి సులభంగా బయటపడవచ్చు. గర్భవతులు రోజూ ఒక గ్లాస్ నారింజ జ్యూస్ తాగినట్లయితే.. ఫోలిక్‌యాసిడ్ సంప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే నారింజ తొక్కను పడేయకుండా… ఎండబెట్టి, పొడి చేసి, సున్నిపిండిలో కలుపుకుంటే మంచిది. ఈ పిండిని స్నానానికి ముందు ఒంటికి రాసుకుని రబ్ చేస్తే… చర్మంపై ఉండే మృతకణాలన్నీ సులభంగా తొలగిపోతాయి. చర్మం మృదువుగా అవటమే కాకుండా, కొత్త మెరుపును సంతరించుకుంటుంది. అన్ని కాలాల్లోనూ ఇప్పుడు హైబ్రీడ్ కమలాలు దొరుకుతున్నా.. ఎక్కువగా చలికాలం నుండి వేసవి కాలందాకా ఎక్కువగా కమలాపండ్లు దొరుకుతాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచగలిగే ఫలాలలో నారింజ పండు ఒకటి. ఆస్తమా, ట్యూబర్‌క్యూలోసిస్‌తో ఇబ్బంది పడేవారికి కమలాపండు అతిముఖ్యమైన ఆహారం. ఈ పండు రసం ఎక్కువగా తీసుకోవడం వలన కిడ్నీలలో రాళ్ళు ఏర్పడకుండా నిరోధించవచ్చు.

Leave a Reply

Your email address will not be published.