ట్రాఫిక్‌లో ఇరుకున్న భారీ విమానం

మేదరమెట్ల: ట్రాలీపై తరలిస్తున్న విమానం బాపట్ల జిల్లా మేదరమెట్ల బైపాస్ వద్ద ఇరుక్కుంది. ఈ విమానాన్ని కొచ్చిన్‌ హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. హైదరాబాద్‌లోని పిస్తాహౌస్‌ హోటల్‌ యాజమాన్యం వ్యాపార విస్తరణ కోసం వినూత్నంగా ఆలోచించింది. కేరళలోని కొచ్చిలో పాత విమానాన్ని కొనుగోలు చేశారు. ఈ పాత విమానాన్ని ఎందుకు కొలుగోలు చేశారనే అనుమానం మీకు రావచ్చు. ఇందులో హోటల్ ఏర్పాటు చేశాయని పిస్తాహౌస్ యాజమాన్యం భావించింది. అనుకున్నట్లే కొచ్చిన్‌లోనే హోటల్‌గా తయారు చేయించి రెక్కలను విడదీసి విడివిడిగా హైదరాబాద్‌ తరలిస్తున్నారు. మేదరమెట్ల కొండ వద్ద రాళ్లను తొలగించే పనులు ప్రారంభించడంతో హైదరాబాద్‌వైపు వెళ్లే రోడ్డును మూసివేశారు. కొచ్చిన్ నుంచి తీసుకువస్తున ట్రావీ బాపట్ల హైవే మెదరమెట్ల వద్ద నిలిచిపోయింది. ఆ వైపు వెళ్లే వాహనాలను ఫ్లైఓవర్‌ మీదుగా కొరిశపాడు వరకు వెళ్లి తిరిగి వచ్చి అండర్‌పాస్‌ ద్వారా దారి మళ్లించారు. ఈ మార్గం ద్వారా కొంతదూరం వెళ్లిన ట్రావీ మధ్యలో ఎత్తు ఉండడంలో ఇరుక్కుపోయింది. అయితే ట్రాలీ సిబ్బంది విమానానికి ఇబ్బంది కలగకుండా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నానాలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.