మనుషులను దోమలు ఎందుకు ఆకర్షిస్తాయో తెలుసా?

దోమలు లేని ప్రాంతం లేదు. దోమల బాధితులు లేరంటే అతిశయోక్తే మరి. ఇప్పుడు దోమల సమస్య విశ్వ వ్యాపితమైంది. దోమ కాటుతో వచ్చే మలేరియా, డెంగీ వంటి రోగాలు కొన్ని సందర్భాల్లో మరణానికి కారణమవుతాయి. అయితే దోమలు కొంతమందినే ఎందుకు టార్గెట్ చేస్తాయని అంటున్నారు. అసలు మనుషులను టార్గెట్ చేయడం ఏమిటనే అనుమానం మీకు రావచ్చు. కానీ ఇది పచ్చి నిజం. చర్మంపై సహజంగా లభించే యాసిడ్ల మిశ్రమం వల్ల వచ్చే వాసనను వెదజల్లుతున్న వ్యక్తుల పట్ల దోమలు ఆకర్షితులవుతాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఎల్లో ఫివర్, డెంగ్యూ, జికా వంటి వైరస్‌లకు కారణమయ్యే ఈడిన్ ఈజిప్టి అనే దోమపై అధ్యయనం చేశారు. ముంజేతి వాసన నమూనాలను ఉపయోగించి 2330 కంటే ఎక్కువ పరీక్షలు చేశారు. దోమల ద్వారా సోకిన వ్యక్తుల కంటే వారి చర్మం నుంచి కార్బాక్సిలిడ్ యాసిడ్స్ అధిక స్థాయిలు స్రవిస్తాయి. మలేరియా సోకిన వ్యక్తులు దోమలకు ఆకర్షణీయంగా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మలేరియా సోకిన వ్యక్తిని దోమలు కుట్టడానికి కారణమవుతున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దోమలు కుట్టడానికి ఇదే ప్రధాన కారణమని అంటున్నారు. దోమల కాటు వల్ల అనేక రోగాలు విజృంభిస్తున్నాయి. దోమల వల్ల అనేక మంది రోగాల బారిన పడుతున్నారు. రోగాల బారిన పడితే ప్రాణాలకే ప్రమాదం. డెంగీతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రాణాంతకరమైన వ్యాధులకు కారణమైన దోమల బారినపడకుండా జాగ్రత్త తీసుకోవాలి. దోమ కాటుకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. దోమల నుంచి వచ్చే అనర్థాలను ముందే గమనించి వాటి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి.

Leave a Reply

Your email address will not be published.