వాకింగ్ చేస్తున్నారా… ఎన్ని నిమిషాలు చేస్తే ఎంత ప్రయోజనమో తెలుసా..!

నాగరిక అంతా నడకతోనే ప్రారంభమైంది. మానవ పరిణామ క్రమంలో మనిషి ఒకే దగ్గర ఉండలేదు. సముద్రాలు, ఖండాలు, నదులు దాటుకుంటూ పురోగమించాడు. ప్రపంచానంత నడకతోనే చుట్టేశాడు. మానవ జీవితంలో నడకకు అంత ప్రాధ్యానత ఉంది. అందుకే ప్రతిరోజు కొంతసేపైనా నడిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచింది. అయితే చాలా మందికి ఎంత సేపు నడవాలే సందేహం అందరిలో ఉంది. మనం ఆరోగ్యంగా ఉండటానికి పలు మార్గాలు అన్వేషిస్తుంటారు. రోజు వాకింగ్ చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అందుకే అందరు విధిగా నడక సాగిస్తున్నారు. రోజుకు ఎన్ని నిమిషాల పాటు వాకింగ్ చేయాలో తెలుసుకుంటే మంచిది. రోజుకు కనీసం మూడు నిమిషాల పాటు నడిస్తే రక్తపోటు అదుపులో ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే రక్తపోటు, మధుమేహం వస్తోంది. దీంతో జీవితకాలం మందులు వేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో వాకింగ్ ఈ రెండు రోగాలకు మంచి మందులా పనిచేస్తుందని తెలియడంతో అందరు నడక కొనసాగిస్తున్నారు. ప్రతి రోజు ఐదు నిమిషాల పాటు వాకింగ్ చేస్తే మానసిన స్థితి మెరుగుపడుతుంది. చాలా మంది మానసిక ప్రశాంతతో బాధపడుతున్నారు. ఇలాంటి ఉదయం పూట వాకింగ్ చేస్తే మనసు ఉల్లాసంగా ఉంటుంది. 5 నుంచి 10 నిమిషాలు నడిస్తే సృజనాత్మకత పెరుగుతుంది.

రోజూ 30 నిమిషాలు నడిస్తే కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నడక ద్వారా గుండె పనితీరు మెరుగువుతుంది. రోజూ 30 నిమిషాలు నడిస్తే కనీసం 100 నుంచి 300 క్యాలరీలు ఖర్చవుతాయి. నడవడం ద్వారా శరీరంలో నిల్వ ఉన్న కొలస్ట్రాల్ ఎక్కువగా కరుగుతాయి. మొదటి 30 నిమిషాల నడక వల్ల మీ శరీరంలో నిల్వ ఉన్న షుగర్ ఇంధనంలా మండుతుంది. అలా నడక కొనసాగించే కొద్ది శరీరంలో ఉన్న కొవ్వులు కరగడం ప్రారంభమవుతుంది. అందేవల్ల రోజూ మీరు 30 నిమిషాలు కంటే ఎక్కువ సేపు నడవడానికి ప్రయత్నిస్తే చాలా మంచిది. నడిచేటప్పుడు మరీ బద్దకంగా అడుగులు వేయకూడదు. వీలైనంత వరకు శరీరం మొత్తం కదిలేలా వేగంగా అగుడులు వేస్తే ప్రయోజనం ఉంటుంది. వేగంగా నడవడం వల్ల సాధారణ సమయంలో కంటే ఊపిరి ఎక్కువగా పీలుస్తారు. దీని వల్ల శ్వాస వ్యవస్థ మెరుగుపడుతుంది. రోజు నడిస్తేనే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఉదయం నడకతో చాలా లాభాలున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరు రోజూ ఏదో ఓ సమయంలో వాకింగ్ చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published.