ఉదయాన్నే నిద్ర లేవడం ఎంత లాభమో తెలుసా..?

మనలో చాలా మంది ఉదయాన్నే నిద్ర నుంచి లేవరు. ఎందుకంటే రాత్రిళ్లు ఎక్కువ సమయం గడుపుతుంటారు. దీనికి కారణం మన జీవన శైలిలో మార్పు రావడమే. ఉదయాన్నే నిద్ర లేవకపోవడం వల్ల అనేక అనర్దాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్న అలవాటు మార్చుకోవడం లేదు. మెట్రో నగరాల్లో ఉదయమే లేవడం వల్ల ఉదయం శబ్ధ కాలుష్యం ఉండదు. ఈ సమయంలో వ్యాయామం, ధ్యానం, యోగా లాంటివి చేసుకుంటే శరీరానికి కూడా ఎంతో ప్రయోజనం. ఉదయమే లేవడం వల్ల దినవారి కార్యక్రమాలను త్వరగా పూర్తి చేసుకోవచ్చు. ఉదయం నిద్ర లేవడం ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఉదయాన్నే లేస్తే మంచి ఏకాగ్రత పెరుగుతుంది. ఉదయం పూట చదువుకుంటే త్వరగా మైండ్‌కు చేరుతుంది. చదువు సాగడంలో ఎలాంటి అవాంతరాలు ఉండవు.

మహానగరాల్లో మనం జీవితమంతా బిజీ లైఫే. ఓ షెడ్యూల్ ప్రకారం నడుచుకుంటే మంచింది. ఈ షెడ్యూల్ ఉదయం నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఉదయం లేవడం వల్ల కుటుంబసభ్యులతో పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి వీలు పడుతుంది. చిన్న పిల్లలతో సదరాగా ఆడుకోవచ్చు. ఉదయం నిద్ర లేవడం వల్ల ఇష్టమైన ఆహారాలు కూడా వండుకోవచ్చు. మన మనసుకు నచ్చిన వంటకాలు తయారుచేసుకుని తృప్తిగా తినొచ్చు. రాత్రి తొందరగా నిద్రపోతే ఉదయం త్వరగా నిద్ర లేవచ్చు. ఉదయం నిద్ర లేచి మన జీవన గమనాన్ని మార్చుకోవచ్చు. దీనికి అందరు వేకువనే నిద్ర లేచేందుకు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

Leave a Reply

Your email address will not be published.